కరోనా విలయం: మార్కెట్ల పతనం

Sensex opens 327 pts lower, Nifty below 14800 - Sakshi

కరోనా మహమ్మారి :  రోజువారీ కేసులు లక్ష మార్క్‌ క్రాస్‌

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌: మార్కెట్ల పతనం

 కీలక స్థాయిల దిగువకు సెన్సెక్స్‌,నిఫ్టీ 

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ ప్రతికూల సంతకేతాలతో తోడు,  దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ, లాక్‌డౌన్‌ కారణాల రీత్యా సోమవారం  కలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిలను కోల్పోయాయి. సెన్సెక్స్‌  401 పాయింట్లు కోల్పోయి  49638 వద్ద, నిఫ్టీ 96 పాయింట్లు కుప్పకూలి14770 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్ట పోతున్నాయి. బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, ఐషర్‌  మోటార్స్‌, ఇండస్‌ ఇండ్‌, బజాజ్‌ఆటో, యాక్సిస్‌ బ్యాంకు భారీగా నష్టపోతున్నాయి. క్యూ4 లో 14 శాతం నికర లాభాలు పుంజుకున్న నేపథ్యంలో  సెయిల్‌   భారీగా లాభపడుతోంది.  సుమారు 5 శాతంలాభాలతో కొనసాగుతోంది. 

కరోనా సెకండ్‌వేవ్‌ ఉన్నప్పటికీ  భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి క్రమంపటిష్టంగానే ఉందని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ నోమురా  తెలిపింది. అయితే లాక్‌డౌన్‌, పెరిగిన ఆంక్షల నేపథ్యంలో క్యూ 2 జీడీపీని ప్రభావితం చేయనుందని హెచ్చరించింది. మరోవైపు  దేశంలో కరోనా కేసులు రికార్డ్‌ స్థాయిలో  నమోదవుతూ  మరింత ఆందోళన రేపుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో లక్షకుపైగా కేసులు నమోదైనాయి. 1,03,558 కొత్త కేసులు,  478 మరణాలు తాజాగా నమోదు కావడం గమనార్హం.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top