బుల్‌ జోరు.. 60 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌! | Sensex Jumps 381 Points, Nifty At Record Close Post RBI Policy | Sakshi
Sakshi News home page

బుల్‌ జోరు.. 60 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌!

Oct 8 2021 4:00 PM | Updated on Oct 8 2021 4:01 PM

Sensex Jumps 381 Points, Nifty At Record Close Post RBI Policy - Sakshi

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండవ రోజు భారీ లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో పాటు ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించడంతో సూచీల సెంటిమెంటు కొనసాగింది. దీంతో కీలక రంగాల్లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభాల్లో కొనసాగాయి. చివరకు, బిఎస్ఈ సెన్సెక్స్ 381 పాయింట్లు లాభపడి 60,059.06కు చేరుకుంటే, నిఫ్టీ 104.90 పాయింట్ల లాభాపడి 17,895.20 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ రూ.74.97 వద్ద ఉంది.

నేడు రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్‌, ఇండస్‌ ఇండ్ బ్యాంక్‌, ఏషియన్ పెయింట్స్‌ షేర్లు రాణిస్తే.. ఎన్‌టీపీసీ, మారుతీ, హెచ్‌యూఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టైటన్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు నష్టాలను చవిచూశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement