లాక్‌డౌన్‌ వార్తలు...రెండో రోజు కూడా నష్టాల్లో ముగిసిన దేశీయ సూచీలు..! 

Sensex Extends Losses to Second Day Tanks 566 Points Nifty Barely Holds 17800 - Sakshi

భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు బుధవారం(ఏప్రిల్‌ 6)న వరుసగా రెండో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. చమురు ధరల పెరుగుదల, యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్  వడ్డీ రేట్ల పెంపు వార్తలతో ఇన్వెస్టర్లు ఆచితూచి మార్కెట్లలో అడుగులువేశారు. దాంతో పాటుగా చైనా ఆర్థిక కేంద్రం షాంఘైలో లాక్‌ డౌన్‌ విధింపు వార్తలు సూచీల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.

బీఎస్‌ఈ సెన్సెక్స్ 566 పాయింట్లు లేదా 0.94 శాతం క్షీణించి 59,610 వద్ద ముగియగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 150 పాయింట్లు లేదా 0.83 శాతం క్షీణించి 17,808 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.59 శాతం, స్మాల్ క్యాప్ 0.12 శాతం క్షీణించడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు నష్టాలను మూటకట్టుకున్నాయి.

విలీన వార్తల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ షేర్లు సోమవారం రోజున భారీ లాభాలను పొందాయి. కాగా గత రెండు సెషన్లలో ఈ స్టాక్స్‌ భారీగా క్షీణించాయి.  హెచ్‌డీఎఫ్‌సి లైఫ్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎంఅండ్ఎం నష్టాలో ముగిశాయి. ఎన్టీపీసీ, టాటా స్టీల్, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్‌టెల్, నెస్లే ఇండియా, ఎల్‌అండ్‌ టీ, ఎస్‌బీఐ లాభాలను గడించాయి.

చదవండి: దేశంలో పెరిగిన గ్యాస్‌ ధరలు, ఓఎన్‌జీసీ..రిలయన్స్‌కు లాభాలే లాభాలు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top