రోజంతా ఊగిసలాట, చివరికి భారీ నష్టాలు | Sensex ends 230 pts lower Nifty below 18350 | Sakshi
Sakshi News home page

StockMarketClosing: రోజంతా ఊగిసలాట, చివరికి భారీ నష్టాలు

Nov 17 2022 3:51 PM | Updated on Nov 17 2022 3:56 PM

Sensex ends 230 pts lower Nifty below 18350 - Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ స్టాక్ మార్కెట్లు  నష్టాల్లో  ముగిసాయి.  రోజంతా  ఒడిదుడుకుల మధ్య సాగిన సూచీలు  చివరికి భారీ నష్టాలతో ముగిసాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు నష్టంతో  61,750 నిఫ్టీ 65 పాయింట్లు నష్టపోయి 18,343  ముగిసింది.  మరోవైపు  గరిష్టస్థాయిల వద్ద ప్రాఫిట్‌ బుకింగ్‌,  బలహీనమైన ప్రపంచ సూచన దాదాపు అన్ని రంగాల షేర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బ్యాంకింగ్‌ ఐటీషేర్లు భారీగా నష్టపోయాయి.

హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్‌  టాటా కన్జ్యూమర్‌,  అదానీ పోరర్ట్స్‌, ఎల్‌ అండ్‌టీ,  ఐసీఐసీఐ బ్యాంకు ,భారతి ఎయిర్‌టెల్‌, భారీగా నష్టపోగా టైటన్‌, ఎం అండ్‌, టాటా మెటార్స్‌, అపోలో హాస్పిటల్స్‌, ఐషర్‌మోటార్‌ లాభపడ్డాయి.   

అటు  ద్రవ్యోల్బణం  దిగిరావడం, వడ్డీరేటు  పెంపు పెద్దగా ఉండదనేభరోసా  మద్య డాలరు పుంజుకోవడంతో గురువారం డాలర్‌తో రూపాయి పడిపోయింది. అటు రూపాయి గత ముగింపు 81.30తో పోలిస్తే  డాలరు మారకంలో రూపాయి భారీ నష్టపోయింది.  35 పైసల నష్టంతో 81.65 వద్ద  ముగిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement