
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఆ తరువాత హై స్థాయిలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ ప్రస్తుతం 183 పాయింట్ల నష్టంతో 49098 వద్ద నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 14456 వద్ద కొనసాగుతున్నాయి. ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు బ్యాంకింగ్, ఫైనాన్సింగ్ షేర్ల లాభాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. మీడియా, రియాల్టీ , మెటల్స్ షేర్లకు భారీ కొనుగోళ్ళ మద్దతుతో లాభాల్లో ట్రేడవుతున్నాయి. అటు రిలయన్స్ కూడా లాభాల బాటలోకి మళ్ళింది.
ముఖ్యంగా కోవిడ్ సంక్షోభం తరువాత ఆర్థిక వ్యవస్థలో మెరుగుదల సంకేతాలు ఉన్నప్పటికీ బ్యాంకులు చెడు రుణాలను రెట్టింపుగా చూడవచ్చని రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించిన నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తులు 2020 సెప్టెంబరులో 7.5 శాతం నుండి 14.8 శాతానికి పెరగవచ్చని ఆర్‌బీఐ వ్యాఖ్యానించింది. 2021 సెప్టెంబరు నాటికి ఇది 13.5 శాతానికి పెరిగే అవకాశం ఉందని ఆర్‌బీఐ అంచనా. దీంతో ఎస్‌బీఐ,హెచ్‌డీఎఫ్‌సీ ,కోటక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంక్ భారీగా నష్టపోతున్నాయి. మరోవైపు నెస్లే, ఎన్‌టీపీసీ, టైటాన్ , ఏషియన్ పెయింట్స్ , బజాజ్ ఆటో టాప్ లూజర్స్‌గా ఉన్నాయి.