సెన్సెక్స్‌ 671 పాయింట్లు క్రాష్‌ | Sensex crashes 671 points | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్‌ 671 పాయింట్లు క్రాష్‌

Published Tue, Jan 9 2024 4:25 AM | Last Updated on Tue, Jan 9 2024 8:18 AM

Sensex crashes 671 points - Sakshi

ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో పాటు దేశీయ కార్పొరేట్‌ డిసెంబర్‌ క్వార్టర్‌ ఫలితాల ప్రకటనకు ముందు ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఫలితంగా సోమవారం దేశీయ మార్కెట్లు దాదాపు ఒకశాతం నష్టపోయాయి. సెన్సెక్స్‌ 671 పాయింట్లు పతనమై 71,355 వద్ద నిలిచింది. నిఫ్టీ 198 పాయింట్లు నష్టపోయి 21,513 వద్ద స్థిరపడింది. ఉదయం స్వల్ప లాభాలతో మొదలైన సూచీలు ఆసియా మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలతో వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి.

రియలీ్ట, మీడియా మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ, మెటల్, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 725 పాయింట్లు నష్టపోయి 71,301 వద్ద, నిఫ్టీ 218 పాయింట్లు పతనమైన 21,711 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. మధ్య తరహా షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో బీఎస్‌ఈ మిడ్‌ క్యాప్‌ సూచీ 0.87% నష్టపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.16.03 కోట్ల షేర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.156 కోట్ల విలువైన షేర్లను కొన్నారు.  

► అమెరికాలో డిసెంబర్‌కు సంబంధించి వ్యవసాయేతర రంగాల్లో 2.16 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది. పేరోల్‌ డేటా అంచనాలకు మించి నమోదవడంతో ‘ఫెడ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా’ ఊహాగాహాలు తెరపైకి వచ్చాయి. చైనా ద్రవ్యోల్బణ, వాణిజ్య లోటు డేటాతో సహా ఆయా దేశాల కీలక స్థూల ఆర్థిక గణాంకాల వెల్లడి ముందు అప్రమత్తత చోటు చేసుకోవడంతో ఆసియా, యూరప్‌ మార్కెట్లు బలహీనంగా కదలాడాయి. అమెరికా ఫ్యూచర్లు సైతం స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
► మెక్వైర్‌ ఈక్విటీస్‌ రీసెర్చ్‌  హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ బ్యాంకులపై రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌ చేయడంతో బ్యాంకింగ్‌ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎస్‌బీఐ 2%, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్, కోటక్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 1.51% నష్టపోయాయి.  
► బీఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ విలువ సోమవారం ఒక్కరోజే రూ.2.91 లక్షల కోట్ల సంపద తగ్గి రూ.366 లక్షల కోట్లకు దిగివచి్చంది.  
► నష్టాల మార్కెట్లో కొన్ని చిన్న రంగాల షేర్లు రాణించాయి.  అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ షేరు ఇంట్రాడేలో 2.50% పెరిగి రూ.1182 వద్ద జీవితకాల గరిష్టాన్ని తాకింది.
► ఈక్విటీ షేర్ల బైబ్యాక్‌కు బోర్డు ఆమోదించినట్లు బజాజ్‌ ఆటో వెల్లడించింది. షేరుకి రూ. 10,000 ధర మించకుండా 40,00,000 షేర్లను తిరిగి కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 4,000 కోట్లు వెచి్చంచనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement