
నిబంధనలు సవరించనున్న సెబీ
న్యూఢిల్లీ: అస్సెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (ఏఎంసీలు) లేదా వాటి సబ్సిడరీలు ఎన్‌పీఎస్ మాదిరి పెన్షన్ స్కీమ్‌లకు పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ (పీవోపీ) సేవలు అందించేందే దిశగా సెబీ కీలక ప్రతిపాదన చేసింది. అలాగే, ఏఎంసీలు తాము నిర్వహిస్తున్న ఫండ్స్‌కు సంబంధించి అంతర్జాతీయ డి్రస్టిబ్యూటర్లు లేదా అడ్వైజర్లుగానూ సేవలు అందించొచ్చన్న ప్రతిపాదన తీసుకొచి్చంది.
ప్రస్తుతం ఏఎంసీలు, వాటి సబ్సిడరీలు తాము నిర్వహిస్తున్న ఫండ్స్‌కు సంబంధించి మాత్రమే నిర్వహణ, అడ్వైజరీ సేవలు అందించేందుకు అనుమతి ఉంది. ఏఎంసీల సబ్సిడరీలు పెన్షన్ ఫండ్ మేనేజర్లుగా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా.. పీవోపీ సేవలను ఆఫర్ చేస్తూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) నుంచి కొంత పరిహారం అందుకోవచ్చని సెబీ తన తాజా ప్రతిపాదనల్లో పేర్కొంది.
అయితే, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా ఏఎంసీలు చూడాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఏఎంసీల సబ్సిడరీలు పెన్షన్ ఫండ్‌కు డైరెక్ట్ ప్లాన్ రూపంలోనే పీవోపీలుగా పనిచేసేందుకు అనుమతి ఉంది. దీనివల్ల పెన్షన్ ఫండ్ అడ్వైజరీ సేవలపై వాటికి ఎలాంటి కమీషన్ లభించడం లేదు. దీంతో సెబీ కొత్త ప్రతిపాదనలు తీసుకొచి్చంది. ఇక అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు మ్యూచువల్ ఫండ్స్ సేవలతోపాటు ఇతర సేవలను సైతం ఏఎంసీలు ఆఫర్ చేసేందుకు సెబీ ప్రతిపాదించింది. వీటిపై ఈ నెల 28 వరకు ప్రజాభిప్రాయాలను సెబీ ఆహ్వానించింది.