స్మార్ట్‌ ఫోన్‌ సెన్సార్లపై రీసెర్చ్‌, వెలుగులోకి సంచలన విషయాలు

Scientists Say Smartphone Sensor Can Detect Someone Consumes Marijuana  - Sakshi

స్మార్ట్‌ ఫోన్లు వినియోగిస్తున్నారా? అయితే వాటితో తస్మాత్‌ జాగ్రత్త! ఎందుకంటే ఫోన్‌లలో ఉన్న సెన్సార్లు గంజాయిని సేవించిన వారిని గుర్తిస్తాయని సైంటిస్ట్‌లు నిర్ధారించారు.   

మనం వినియోగించే స్మార్ట్‌ ఫోన్‌లలో ఉన్న సెన్సార్లు అనేక రకాలైన పనులు చేస్తాయి.వాటిలో మోషన్‌ సెన్సార్స్‌, ఎన్విరాన్‌ మెంటల్‌ సెన్సార్‌, పొజీషన్‌ సెన్సార్‌, ఆంబీనెట్‌ లైట్‌ సెన్సార్‌లు ఉంటాయి. కానీ అవి ఎందుకు ఉన్నాయి?ఎలా పనిచేస్తాయనే విషయం గురించి పట్టించుకోం.కానీ ఇదే సెన్సార్‌లపై 'అమెరికన్‌ రట్జర్స్ యూనివర్సిటీ' సైంటిస్ట్‌లు 'జనరల్‌ డ్రగ్‌ అండ్‌ ఆల్కహాల్‌ డిపెండెన్సీ' పేరుతో రిసెర్చ్‌ చేశారు.

రిసెర్చ్‌లో భాగంగా..వారానికి రెండు సార్లు గంజాయి సేవించిన యువకుల నుంచి సంబంధిత డేటాను సేకరించారు.ఆ డేటా సాయంతో ఫోన్‌ సెన్సార్ల ద్వారా గంజాయి సేవించిన సదరు యువకుల్ని పరీక్షించారు.ఆ టెస్ట్‌ల్లో యువకులు గంజాయి ఎప్పుడు తీసుకున్నారు? ఎంత తీసుకున్నారు. తీసుకున్న తరువాత వారి శరీరం తీరు ఎలా ఉందని గుర్తించారు.అంతేకాదు స్మార్ట్‌ ఫోన్‌ సెన్సార్ల సాయంతో యువకులు ఎంత మొత్తంలో గంజాయి తీసుకున్నారో 90శాతం పాజిటీవ్‌ రిజల్ట్‌ వచ్చిందని సైంటిస్ట్‌ టామీ చుంగ్ తెలిపారు. 

చదవండి : ఛార్జర్‌ ఒక్కటే.. కొత్త ఫోన్లకు ఛార్జర్లు ఇవ్వరు!!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top