SBI Big Update: New Charges On Cash Withdrawal, Chequebook From July 1 - Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ : జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు

May 25 2021 6:49 PM | Updated on May 25 2021 8:57 PM

SBI: New charges on cash withdrawal, chequebook from July 1 - Sakshi

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) కస్టమర్లకు హెచ్చరిక. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు విధించే సేవా ఛార్జీలను సవరించింది. ఏటీఎంలో డబ్బులు విత్‌డ్రా చేయడం, చెక్‌బుక్, ఇతర ఆర్థిక లావాదేవీలకు జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్. ఇందులో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇతర అకౌంట్లలో అయితే మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం తప్పనిసరి. ఒకవేల మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ హోల్డర్లకు బేసిక్ రూపే ఏటీఎం కమ్ డెబిట్ కార్డు వస్తుంది. నెలలో నాలుగు సార్లు ఉచితంగా బ్యాంక్ బ్రాంచ్‌లో, ఏటీఎంలో డబ్బులు డ్రా చేయొచ్చు. అంతకన్నా ఎక్కువసార్లు డ్రా చేస్తే సర్వీస్ ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీ రూ.15+జీఎస్‌టీ వర్తిస్తుంది. అంటే ఎస్‌బీఐ, నాన్ ఎస్‌బీఐ ఏటీఎంలల్లో, బ్రాంచ్‌లో కలిపి ఒక నెలలో నాలుగు సార్లు మాత్రమే డబ్బులు డ్రా చేసే అవకాశం ఉంటుంది.

ఎస్‌బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులకు ఒక ఆర్థిక సంవత్సరంలో 10 చెక్స్ ఉచితంగా అందిస్తుంది. ఆ తర్వాత మరో 10 చెక్స్ ఉన్న బుక్ కావాలంటే రూ.40+జీఎస్‌టీ, 25 చెక్స్ ఉన్న బుక్ కావాలంటే రూ.75+జీఎస్‌టీ చెల్లించాలి. 10 చెక్స్‌తో ఎమర్జెన్సీ చెక్ బుక్ కావాలంటే రూ.50+జీఎస్‌టీ చెల్లించాలి. సీనియర్ సిటజన్లకు చెక్ బుక్‌పై కొత్త సర్వీస్ ఛార్జీ వర్తించదు. ఇక ఎస్‌బీఐ, నాన్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లల్లో ఎస్‌బీఐ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారులు జరిపే నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు విధించరు.

చదవండి:

ఐఎఫ్ఎస్‌సీ కోడ్‌ల‌ను అప్‌డేట్ చేసుకోండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement