SBI WhatsApp Banking: SBI To Launch WhatsApp Banking Services Soon - Sakshi
Sakshi News home page

SBI-Whatsapp Banking: ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త!

Jul 2 2022 11:17 AM | Updated on Jul 2 2022 1:02 PM

SBI to Launch WhatsApp Banking Services Soon - Sakshi

దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. త్వరలో వాట్సాప్‌ ద్వారా బ్యాంకింగ్‌ సేవల్ని అందుబాటులో తెస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా ఎస్‌బీఐ బ్యాంకింగ్‌ సేవల్ని మరింత సులభతరం కానున్నాయి.    

జులై1న జరిగిన వర్చువల్‌ మీటింగ్‌లో ఎస్‌బీఐ ఛైర్మన్‌ శుక్రవారం దినేష్‌ ఖారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన.. ఎస్‌బీఐ పలు కొత్త సేవల్ని అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. వాటిలో ముఖ్యంగా వాట్సాప్‌లో ఎస్‌బీఐ బ్యాంకింగ్‌ సేవలు ఉంటాయని అన్నారు. అయితే అవి ఎలాంటి సేవలనే అంశంపై స్పందించలేదు.     

ఇప్పటికే ఎస్‌బీఐ వాట్సాప్‌ బ్యాంకింగ్‌ సేవలు 
ఎస్‌బీఐ ఇప్పటికే క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్లకు అందిస్తుంది.అకౌంట్‌ సమరి, రివార్డ్‌ పాయింట్స్‌, అవుట్‌ స్టాండింగ్‌ బ్యాలెన్స్‌, కార్డ్‌ పేమెంట్స్‌ వంటి వివరాల్ని వాట్సాప్‌లో పొందవచ్చు. ఒకవేళ​ మీరూ ఆ సేవల్ని వినియోగించుకోవాలంటే "కేపిటల్‌ లెటర్స్‌తో ఇంగ్లీష్‌లో(OPTIN) ఓపీటీఐఎన్‌ అని టైప్‌ చేసి 9004022022 నెంబర్‌కు మెసేజ్‌ చేయోచ్చు. లేదంటే 08080945040 మిస్డ్‌ కాల్‌ ఇచ్చి సైనప్‌ అవ్వచ్చు. వాట్సాప్‌ ద్వారా క్రెడిట్‌ కార్డ్‌కు సంబంధించి బ్యాంకింగ్‌ సేవల్ని వినియోగించుకోవచ్చు."

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement