SBI Home Loans Offers This Independence Day - Check Details - Sakshi
Sakshi News home page

Home Loan: కొత్త ఇల్లు కొనేవారికి ఎస్‌బీఐ శుభవార్త!

Aug 13 2021 4:54 PM | Updated on Aug 14 2021 9:35 AM

SBI Home Loan Offers This Independence Day, Check Interest Rates - Sakshi

మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. 2021 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గృహ రుణాలపై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు తీసుకోవడం లేదని ప్రకటించింది. "ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున, గృహ రుణాలపై జీరో ప్రాసెసింగ్ ఫీజుతో మీ కలల ఇంటిలోకి అడుగు పెట్టండి" అని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది. గృహ రుణాలపై అందించే ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు గృహ రుణాలపై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజును ఉండదు.
  • ఎస్‌బీఐ మహిళా ఖాతాదారులకు 5 బీపీఎస్ వడ్డీ రాయితీ లభిస్తుంది.
  • ఎస్‌బీఐ యోనో వినియోగదారులకు కూడా యోనో ద్వారా అప్లై చేస్తే 5 బీపీఎస్ వడ్డీ రాయితీ లభిస్తుంది.
  • ఎస్‌బీఐ కస్టమర్లకు 6.70 శాతం వడ్డీ రేటుకే గృహ రుణాలు పొందవచ్చు.
  • రుణగ్రహీతలు గృహ రుణం కొరకు 7208933140 నెంబరుకు మిస్ డ్ కాల్ ఇవ్వవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement