రేపట్నుంచే సర్వీస్‌ ఛార్జీల మోత : ‘ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు భారీ షాక్‌’

Sbi Card To Charge Processing Fees On Rent Payments From November 15 - Sakshi

క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు ఎస్‌బీఐ భారీ షాకిచ్చింది.  ఈఎంఐ లావాదేవీలపై ప్రస్తుతం ఉన్న ప్రాసెసింగ్‌ ఫీజుపై అదనంగా రూ.100, అలాగే కొత్తగా రెంట్‌ పేమెంట్‌పై ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్‌ 15 నుంచి ఇది అమల్లోకి వస్తున్నట్లు కార్డు వినియోగదారులకు సమాచారం అందించింది. 

కస్టమర్లకు ఎస్‌బీఐ పంపిన మెసేజ్‌ ప్రకారం.. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ద్వారా రెంటు పే చేస్తే.. ఆ రెంటుపై రూ.99+ జీఎస్టీ 18శాతం వసూలు చేయనున్నట్లు తెలిపింది. ఈ కొత్త ఛార్జీలు నవంబర్‌ నెలనుంచి అమల్లోకి రానున్నట్లు అందులో పేర్కొంది. 

ఉదాహరణకు.. సురేష్‌ తన ఇంటిరెంట్‌ రూ.12వేలను ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో చెల్లించేవారు. బ్యాంకు సైతం ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేసేవి కావు. కానీ తాజాగా ఎస్‌బీఐ తెచ్చిన నిబంధన మేరకు..సురేష్‌ తన ఇంటి రెంటును రూ.12వేలు చెల్లించడంతో పాటు అదనంగా ప్రాసెసింగ్‌ ఫీజు రూ.99, జీఎస్టీ 17.82 శాతం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.   

ఇక ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుపై ప్రాసెసింగ్‌ ఫీజును పెంచింది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డును వినియోగించి ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే .. ఆ వస్తువు ధర ప్రాసెసింగ్‌ ఫీజు రూ.199 (అంతకు ముందు రూ.99 ఉంది), 18శాతం జీఎస్టీని చెల్లించాల్సి ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top