ఎస్‌బీఎఫ్‌సీ ఫైనాన్స్‌ ఐపీవో కుదింపు

SBFC Finance refiles DRHP to reduce promoter OFS size in IPO - Sakshi

తాజా లక్ష్యం రూ. 1,200 కోట్లు

ముంబై: ఎన్‌బీఎఫ్‌సీ.. ఎస్‌బీఎఫ్‌సీ ఫైనాన్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ద్వారా నిధుల సమీకరణ లక్ష్యాన్ని కుదించుకుంది. తొలుత వేసిన రూ. 1,600 కోట్లలో రూ. 400 కోట్లమేర కోత పెట్టుకుంది. వెరసి రూ. 1,200 కోట్ల సమీకరణకు సిద్ధపడుతోంది. ఐపీవోలో భాగంగా కంపెనీ రూ. 750 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 450 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు.

కంపెనీ గతేడాది నవంబర్‌లో క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఈక్విటీ జారీ నిధులను మూలధన పటిష్టతకు వినియోగించనుంది. ఐపీవోలో భాగంగా ప్రయివేట్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా రూ. 150 కోట్లు సమకూర్చుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతో ఆఫర్‌ పరిమాణం తగ్గే అవకాశముంది. ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) ఏప్రిల్‌–డిసెంబర్‌ కాలంలో రూ. 525 కోట్ల ఆదాయం సాధించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top