బడ్జెట్ లో కిల్లర్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన శామ్‌సాంగ్‌ | Samsung Galaxy M32 Launched With MediaTek Helio G80 SoC | Sakshi
Sakshi News home page

బడ్జెట్ లో కిల్లర్ స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన శామ్‌సాంగ్‌

Jun 21 2021 4:03 PM | Updated on Jun 21 2021 4:03 PM

Samsung Galaxy M32 Launched With MediaTek Helio G80 SoC  - Sakshi

ప్రముఖ ఎలక్ట్రానిక్, మొబైల్ తయారీ సంస్థ శామ్‌సాంగ్‌ మార్కెట్లోకి బడ్జెట్ లో మరో కిల్లర్ మొబైల్ తీసుకొనివచ్చింది. గత ఏడాది తీసుకొచ్చిన గెలాక్సీ ఎమ్31 కొనసాగింపుగా ఈ ఏడాది గెలాక్సీ ఎమ్32ను నేడు(జూన్ 21) లాంచ్ చేసింది. ఈ కొత్త శామ్‌సాంగ్‌ ఫోన్ 90హెర్ట్జ్ అమోల్డ్ డిస్ ప్లే, 6,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీతో వస్తుంది. శామ్‌సాంగ్‌ గెలాక్సీ ఎమ్32లో మీడియాటెక్ హీలియో జీ80 ఎస్ వోసి ప్రాసెసర్ తీసుకొని వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ క్వాడ్ రియర్ కెమెరాలతో వస్తుంది. మూవీలు, గేమ్స్, సోషల్ మీడియా కోసం ప్రత్యేకంగా ఆప్టిమైజ్ చేసినట్లు సంస్థ ప్రతినిదులు పేర్కొన్నారు. గెలాక్సీ ఎమ్32 రెడ్ మి నోట్ 10ఎస్, పోకో ఎం3 ప్రో, రియల్ మీ 8 5జీ వంటి వాటితో పోటీపడనుంది.

భారతదేశంలో శామ్‌సాంగ్‌ గెలాక్సీ ఎమ్32 4జీబీ + 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.14,999గా ఉంటే, 6జీబీ + 128జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.16,999గా ఉంది. ఇది బ్లాక్, లైట్ బ్లూ కలర్ ఆప్షన్ ల్లో లభిస్తుంది. దేశవ్యాప్తంగా అమెజాన్, శామ్ సంగ్ ఇండియా ఆన్ లైన్ స్టోర్, కీలక రిటైల్ స్టోర్ల ద్వారా కొనుగోలుకు రానుంది. అమెజాన్ లిస్టింగ్ ప్రకారం జూన్ 28 నుంచి అమ్మకం ప్రారంభమవుతుంది. పరిచయ ఆఫర్ కింద ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా గెలాక్సీ ఎమ్32 కొనుగోలు చేసే వినియోగదారులకు రూ.1,250 క్యాష్ బ్యాక్ లభిస్తుంది.

గెలాక్సీ ఎమ్32 స్పెసిఫికేషన్లు

  • 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోల్డ్ డిస్ ప్లే
  • ఆండ్రాయిడ్ 11 ఓఎస్(వన్ యుఐ 3.1)
  • 90హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 800 నిట్స్ బ్రైట్ నెస్ 
  • ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ 
  • 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ 
  • 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్
  • 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ 
  • 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్
  • 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
  • సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 
  • 6,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 
  • 25డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ (బాక్స్లో 15డబ్ల్యు ఛార్జర్ వస్తుంది) 
  • 4జీ ఎల్ టిఈ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్/ ఎ-జీపీఎస్, యుఎస్ బి టైప్-సీ, 3.5మిమి హెడ్ ఫోన్ జాక్ 
  • 196 గ్రాముల బరువు

చదవండి: ఒక్కరాత్రిలో ట్రిలియనీర్‌ అయిన స్కూల్ విద్యార్థి? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement