శాంసంగ్‌కు గట్టిషాకిచ్చిన హ్యాకర్లు..! ప్రమాదంలో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు.!

Samsung Confirms Data Breach By Hackers Involving Source Code Of Galaxy Smartphones - Sakshi

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం శాంసంగ్‌కు హ్యాకర్లు గట్టిషాక్‌ను ఇచ్చారు. శాంసంగ్‌ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్స్‌కు చెందిన సోర్స్‌ కోడ్‌ను, కంపెనీ అంతర్గత విషయాలను  హ్యకర్లు దొంగిలించినట్లుగా తెలుస్తోంది. సోర్స్‌ కోడ్‌ను హ్యకర్లు దొంగిలించినట్లుగా శాంసంగ్‌ సోమవారం(మార్చి 8)న ధృవీకరించింది. 

అత్యంత సున్నితమైన సమాచారం..!
ప్రముఖ టెక్‌ బ్లాగ్‌ బ్లీపింగ్‌ కంప్యూటర్‌(Bleeping Computer) ప్రకారం..గెలాక్సీ స్మార్ట్‌ఫోన్స్‌కు సంబంధించిన సోర్స్‌ కోడ్‌ను  'Lapsus$' అనే హ్యకర్ల బృందం దొంగిలించినట్లు తెలుస్తోంది. సుమారు  190GB సీక్రెట్ డేటాను హ్యకర్లు సేకరించారు. సోర్స్‌ కోడ్‌తో పాటుగా, కంపెనీకి సంబంధించిన అంతర్గత డేటాను హ్యకర్లు బహిర్గతం చేశారు. ఇక ఈ సోర్స్‌ కోడ్‌లో సున్నితమైన కార్యకలాపాల కోసం ఉపయోగించే విశ్వసనీయ ఆప్లెట్ (TA) సోర్స్ కోడ్ , బూట్‌లోడర్ సోర్స్ కోడ్, శాంసంగ్‌ అకౌంట్‌కు చెందిన ప్రామాణీకరణ కోడ్ వంటివి ఉన్నాయి. కాగా  ఈ హ్యకర్ల బృందం గత నెల ఫిబ్రవరిలో NVIDIA నుంచి కూడా డేటాను దొంగిలించింది.

ఎలాంటి భయం లేదు..!
ఈ సైబర్‌ దాడిపై శాంసంగ్‌ వివరణను ఇచ్చింది. ఈ సోర్స్‌ కోడ్‌లో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్స్‌ ఆపరేషన్‌కు సంబంధించిన కొంత సోర్స్ కోడ్‌ను కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. ఆయా శాంసంగ్ యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కంపెనీ తెలిపింది.  దీనిలో గెలాక్సీ యూజర్లకు, కంపెనీ ఉద్యోగుల వ్యక్తిగత సమాచారం లేదని శాంసంగ్‌ వెల్లడించింది. ఇది కంపెనీ వ్యాపారం లేదా కస్టమర్లపై ఎలాంటి ప్రభావం చూపదని కంపెనీ అభిప్రాయపడింది. ఇటువంటి సంఘటనలను నిరోధించడానికి మరిన్ని పటిష్టమైన చర్యలను అమలు చేస్తామని శాంసంగ్‌ తెలిపింది. కాగా హ్యాక్ చేసిన డేటాను అత్యంత సున్నితమైనది  పరిగణించబడుతుందని శాంసంగ్‌ పేర్కొంది.

చదవండి:  క్రేజీ ఆఫర్‌..! పలు మహీంద్రా కార్లపై రూ. 3 లక్షల వరకు భారీ తగ్గింపు..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top