ఎలన్‌ మస్క్‌ చేతిలో ట్విటర్‌.. సీఈవో పరాగ్‌కి పొగ?

Research firm Equilar: Twitter CEO To Get 42 Million dollars If Sacked - Sakshi

ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ను సొంతం చేసుకోవడంతో ప్రస్తుతం సీఈవోగా వ్యవహరిస్తోన్న పరాగ్‌ అగర్వాల్‌ బయటకు వెళ్లక తప్పదనే ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో పరాగ్‌ బయటకు వెళితే ఎంత మొత్తం పరిహారంగా చెల్లిస్తారనే అంశంపై ఈక్విలర్‌ సంస్థ ఓ అంచనా వేసింది.

ప్రీ స్పీచ్‌ విషయంలో ట్విటర్‌ బోర్డు వ్యవహరిస్తున్న తీరు, విధిస్తున్న ఆంక్షలు సరిగా లేవంటూ ఎలన్ మస్క్‌ 2022 ఏప్రిల్‌ 14న సెక్యూరిటీస్‌ దగ్గర దాఖలు చేసిన పత్రాల్లో పేర్కొన్నారు. ఆ తర్వాత ఏకమొత్తంగా ట్విటర్‌ను కొనుగోలు చేస్తానంటూ ఆఫర్‌ చేశాడు. అన్నట్టుగానే సాధించాడు. దీంతో 2013 నుంచి పబ్లిక్‌ లిమిలెడ్‌ కంపెనీగా ఉన్న ట్విటర్‌ త్వరలో ప్రైవేట్‌ లిమిటెడ్‌ కానుంది.

మరోవైపు 2021 నవంబరులో ట్విటర్‌ సీఈవోగా పరాగ్‌ అగర్వాల్‌ ఎంపికయ్యారు. అంతకు ముందు ఆయన ట్విటర్‌లో చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా ఉన్నారు. సీఈవో హోదాలో కంపెనీలో కొన్ని షేర్లతో పాటు వార్షిక వేతనంగా 30.4 మిలియన్‌ డాలర్ల ప్యాకేజీని పరాగ్‌ పొందారు. ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌కి కొత్త సీఈవోని తీసుకువస్తే పరాగ్‌కి పరిహారంగా 42 మిలియన్లు చెల్లించాల్సి వస్తుందంటూ  ఈక్విలర్‌ సంస్థ తెలిపింది.

చదవండి: మస్క్‌ చేతికి ట్విటర్‌.. సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ సంచలన వ్యాఖ్యలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top