మస్క్‌ చేతికి ట్విటర్‌.. సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ సంచలన వ్యాఖ్యలు

Parag Agarwal Interesting Comments Over Twitter Elon Musk Deal - Sakshi

Twitter CEO Parag Agrawal: ట్విటర్‌ కంపెనీ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌.. తాజా పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారీ డీల్‌కు ట్విటర్‌ ప్రపంచ బిలియనీర్‌ ఎలన్‌ మస్క్‌ చేతికి వెళ్తున్న విషయం తెలిసిందే. అధికారికంగా దీనిపై ప్రకటన సైతం వెలువడింది. ఈ తరుణంలో.. సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ ఆసక్తికరవ్యాఖ్యలు చేశారు. 

సోమవారం.. కంపెనీ ఉద్యోగులు, కీలక ప్రతినిధులతో ఆయన భేటీ (ఆల్‌ హ్యాండ్స్‌ మీటింగ్‌) అయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ఇంటెరాక్షన్‌ సందర్భంగా ఆయన ట్విటర్‌ భవితవ్యంపై వ్యాఖ్యలు చేశారు. ట్విటర్‌ ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుండడంతో.. సోషల్‌ మీడియా కంపెనీలో అనిశ్చితి నెలకొనడయం ఖామని వ్యాఖ్యానించాడు. 
 
ఎలన్‌ మస్క్‌ చేతికి పగ్గాలు అప్పిగించాక.. అమెరికా మాజీ ప్రెసిడెంట్‌ ట్రంప్‌పై విధించిన ట్విటర్‌ నిషేధం ఎత్తేస్తారా? అనే ప్రశ్నకు పరాగ్‌ బదులిస్తూ..  ‘ఒకసారి డీల్‌ ముగిశాక.. ప్లాట్‌ఫామ్‌ పయనం ఎటువైపు ఉంటోదో మేం చెప్పలేం. కానీ, ఒక ప్రైవేట్‌ వ్యక్తి చేతుల్లోకి వెళ్తే.. అనిశ్చితి నెలకొనడం మాత్రం ఖాయం. ఒకవేళ ఎలన్‌తో మాట్లాడేటప్పుడు దీనికంటూ(ట్రంప్‌పై నిషేధం ఎత్తివేత) ఓ సమాధానం దొరకవచ్చు’ అని పేర్కొన్నాడు. అలాగే.. ఈ కీలక సమయంలో లేఆఫ్‌లు ఉండబోవని ఉద్యోగులకు గ్యారెంటీ ఇచ్చాడాయన. 

ఇక భేటీకి కొత్త ఓనర్‌ ఎలన్‌ మస్క్‌ సైతం హాజరు కావాల్సి ఉండగా.. ఎందుకనో గైర్హాజరయ్యాడు. అలాగే సహా వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే, ఇతర కీ సభ్యులు సైతం హాజరు కాలేదు. చైర్మన్‌ బ్రెట్‌ టేలర్‌ మాత్రమే హాజరయ్యాడు. ఇక ట్విటర్‌, ఎలన్‌ మస్క్‌ చేతుల్లోకి వెళ్లడానికి ఇంకా ఆరు నెలల సమయం పట్టనుందని బ్రెట్‌, పరాగ్‌లు ఉద్యోగులకు స్పష్టత ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. ట్విటర్‌ను ఎలన్‌ మస్క్‌ చేజిక్కిచుకునే ప్రయత్నాలు మొదలైనప్పటి నుంచి.. ఉద్యోగుల్లో తీవ్రమైన అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కొందరైతే ట్విటర్‌లోనే తమ నిరసన ‍వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏదిఏమైనా మార్పు తప్పదని సోమవారం ఉదయం ఈ డీల్‌కు సంబంధించి ఉద్యోగులకు మెయిల్‌ పెట్టాడు సీఈవో పరాగ్‌ అగర్వాల్‌.

చదవండి: ట్విటర్‌-ఎలన్‌ మస్క్‌ ఒప్పందం ఎంతంటే..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top