రియలన్స్‌ ఇండస్ట్రీస్‌, ఆరామ్‌కో డీల్‌.. రీ ఎవాల్యుయేట్‌

Reliance Saudi Aramco to re evaluate oil to chemicals investment proposals - Sakshi

రియలన్స్‌ ఇండస్ట్రీస్‌, సౌదీ ఆరామ్‌కో కంపెనీల మధ్య గతంలో కుదిరిన వ్యాపార ఒప్పందంలో తిరిగి కదలిక వచ్చింది. 2019 ఆగస్టులో ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే కరోనా కారణంగా ఆ తర్వాత ఈ ఒప్పంద విషయంలో మళ్లీ ఎటువంటి పురోగతి లేదు. కాగా సంప్రదాయేతర ఇంధన వనరుల విభాగంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని ఇటీవల రిలయన్స్ నిర్ణయించింది. గుజరాత్‌లోని జామ్‌నగర్లో ఏకంగా నాలుగు గిగా ఫ్యాక్టరీలో నెలకొల్పబోతుంది. ఈ నేపథ్యంలో తమ పెట్రోకెమికల్‌, ఆయిల్‌ రిఫైనరీలో 20 శాతం వాటాల విక్రయానికి సౌదీ అరామ్కోతో డీల్‌ను తిరిగి మదింపు చేయాలని నిర్ణయించినట్టు రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ ప్రకటించింది.

 రూ.1,.13 లక్షల కోట్ల విలువ గల ఈ డీల్‌ ఇప్పటికి రెండు సార్లు పట్టాలకెక్కడంలో విఫలమైంది. అయితే కొత్త ఇంధన రంగాల్లోకి ప్రవేశించాలన్న రిలయన్స్‌ ఆకాంక్షకు అనుగుణంగా ఆ డీల్‌ను పునఃపరిశీలించాలని నిర్ణయించినట్టు ఉభయ సంస్థలు తాజాగా ప్రకటించాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top