రిలయన్స్‌ చీరలు కూడా వచ్చేస్తున్నాయ్‌... | Reliance Retail to enter ethnic wear space with Avantra | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌ చీరలు కూడా వచ్చేస్తున్నాయ్‌...

Published Tue, Sep 7 2021 1:05 AM | Last Updated on Tue, Sep 7 2021 7:42 AM

Reliance Retail to enter ethnic wear space with Avantra - Sakshi

సంప్రదాయ దుస్తులు, చీరల విభాగంలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ రిటైల్‌ (ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌), టాటా గ్రూప్‌నకు చెందిన తనిష్క్‌ తదితర సంస్థలకు పోటీగా రిలయన్స్‌ రిటైల్‌ కూడా రంగంలోకి దిగుతోంది. కొత్తగా అవంత్రా పేరిట స్టోర్స్‌ చెయిన్‌ను ప్రారంభించనుంది. ప్రైవేట్‌ లేబుల్స్‌ను విక్రయించడంతో పాటు ప్రాంతీయంగా వీవర్‌ క్లస్టర్లతో పాటు నల్లి సిల్క్స్‌ .. పోతీస్‌ వంటి థర్డ్‌ పార్టీ బ్రాండ్లతో కూడా అవంత్రా జట్టుకట్టనుంది. ఆభరణాలు, యాక్సెసరీలు, టైలరింగ్‌ సరీ్వసులు కూడా అందించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

తొలి స్టోరు బెంగళూరులో ఏర్పాటవుతుందని, ఆ తర్వాత కర్ణాటకలోని మిగతా ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించవచ్చని వివరించాయి. ఆభరణాల బ్రాండ్‌ అయిన తనిష్క్‌ సంప్రదాయ దుస్తుల్లోకి అడుగుపెట్టడం, ఏబీఎఫ్‌ఆర్‌ఎల్‌ కూడా సవ్యసాచి, తరుణ్‌ తహిలియాని వంటి దేశీ డిజైనర్‌ వేర్‌ బ్రాండ్స్‌లో వాటాలు కొనుగోలు చేసిన నేపథ్యంలో రిలయన్స్‌ అవంత్రా స్టోర్స్‌ ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement