Reliance AGM: లక్ష కోట్లతో భారీ ఒప్పందం..!

ముంబై: ప్రస్తుతం రిలయన్స్ కంపెనీ ఏర్పాటుచేసే వార్షిక వాటాదారుల మీటింగ్(AGM)పైనే అందరీ దృష్టి. ఈ సమావేశం ఈ నెల 24 న జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై రిలయన్స్ కంపెనీ భారీ ప్రకటనలను చేయనున్నట్లు తెలుస్తోంది. 4జీ రాకతో రిలయన్స్ దేశ వ్యాప్తంగా విప్లవత్మాకమైన మార్పులు తీసుకొని వచ్చింది. మారుమూల గ్రామాలకు సైతం 4జీ టెక్నాలజీ అందించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ సమావేశంలో రిలయన్స్ అతి తక్కువ ధరకే 5జీ ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
రిలయన్స్ ఏజీఎం మీటింగ్‌లో భారీ ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని వ్యాపార నిపుణుల భావిస్తున్నారు. సుమారు 15 బిలియన్ డాలర్ల(రూ.లక్ష కోట్లు)తో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సౌదీకు చెందిన అరాంకో కంపెనీతో భారీ ఒప్పందం జరగనున్నట్లు తెలుస్తోంది. జూన్ 24న జరిగే రిలయన్స్ ఏజీఎం సమావేశంలో ఆరాంకో చైర్మన్, కింగ్డమ్ ఆఫ్ వెల్త్ ఫండ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ గవర్నర్ యాసిర్ అల్-రుమయ్యన్ ఈ సమావేశంలో పాల్గొనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: జియో మరో కీలక నిర్ణయం..! ఎలాంటి డిపాజిట్ లేకుండానే..