ఔటర్‌.. సూపర్‌

Real estate runs in the suburbs of Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారు ప్రాంతాలలో రియల్‌ ఎస్టేట్‌ పరుగులు పెడుతోంది. కొత్త గహాల లాంచింగ్స్‌లో ప్రధాన నగరంలో కంటే ఔటర్‌ ప్రాంతాలదే హవా కొనసాగుతుంది. 2021 ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌లో 30,340 గృహాలు లాంచింగ్‌ కాగా.. ఇందులో 45 శాతం ఔటర్‌ ప్రాంతాల్లోనే ప్రారంభమయ్యాయి. మేడ్చల్, మియాపూర్, నిజాంపేట, శంషాబాద్, కోకాపేట, పటాన్‌చెరు, తెల్లాపూర్‌ శివార్లలోనే కేంద్రీకృతమయ్యాయి. ఎఫ్‌వై 19లోని మొత్తం 18,460 యూనిట్లలో 35 శాతం శివారుల్లోనే లాంచింగ్‌ అయ్యాయని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ తెలిపింది.

58 శాతం హౌసింగ్స్‌ ఔటర్‌లోనే..
దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2021 ఆర్థ్ధిక సంవత్సరంలో 1.49 లక్షల గృహాలు లాంచింగ్‌ కాగా.. ఇందులో 58 శాతం శివారు ప్రాంతాలలోనే ప్రారంభమయ్యాయి. ఎఫ్‌వై20లో 2.07 లక్షల యూనిట్లు ప్రారంభం కాగా.. ఇందులో 53 శాతం, అలాగే ఎఫ్‌వై 19లో 2.29 లక్షల ఇళ్లు ప్రారంభం కాగా.. ఇందులో 51 శాతం గృహాలు శివారు ప్రాంతాల్లోనే లాంచింగ్‌ అయ్యాయి. శివారు ప్రాంతాలలో ప్రాజెక్ట్‌ల లాంచింగ్స్‌లో పుణే ప్రథమ స్థానంలో.. కోల్‌కతా చివరి స్థానంలో నిలిచింది. ఎఫ్‌వై 21లో పుణేలో 29,950 గృహాలు ప్రారంభం కాగా.. 76 శాతం ముల్శీ, పిరంగట్, దౌండ్, కంషేట్, రావేట్, చకాన్, చికాళీ, వాడ్గావ్‌ బుద్రక్, తలేగావ్‌ దభాడే, ఉంద్రీ శివారుల్లోనే ఉన్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top