రూ. 200 లిమిట్‌..! నగదు చెల్లింపులపై ఆర్‌బీఐ కొత్త ఫ్రేమ్‌వర్క్‌..! | RBI Releases Framework For Offline Digital Payments | Sakshi
Sakshi News home page

RBI: రూ. 200 లిమిట్‌..! నగదు చెల్లింపులపై ఆర్‌బీఐ కొత్త ఫ్రేమ్‌వర్క్‌..!

Published Mon, Jan 3 2022 9:02 PM | Last Updated on Mon, Jan 3 2022 9:10 PM

RBI Releases Framework For Offline Digital Payments - Sakshi

RBI Releases Framework For Offline Digital Payments: దేశవ్యాప్తంగా ఆఫ్‌లైన్‌ చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు భారత రిజర్వు బ్యాంక్‌(ఆర్‌బీఐ) సిద్దమైన విషయం తెలిసిందే. అందులో భాగంగా తాజాగా ఆఫ్‌లైన్‌ నగదు చెల్లింపుల కోసం కొత్త ఫ్రేమ్‌ వర్క్‌ను ఆర్‌బీఐ సోమవారం (జనవరి 3)న విడుదల చేసింది. 2020 ఆగస్టులోనే ఆర్‌బీఐ ఆఫ్‌లైన్‌ పేమెంట్స్‌ను పైలట్‌ ప్రాజెక్టుగా మొదలు పెట్టింది.  ఈ పైలట్‌ ప్రాజెక్టు మార్చి 31, 2021 వరకు కొనసాగింది. అందులో భాగంగా సుమారు రూ. 1.16 కోట్ల విలువైన 2.41 లక్షల ఆఫ్‌లైన్‌ లావాదేవీలను ఆర్బీఐ పరిక్షించింది. 

ఆఫ్‌లైన్‌ పేమెంట్స్‌పై ఆర్బీఐ కొత్త ఫ్రేమ్‌ వర్క్‌ ఇదే..!

► తక్కువ విలువ కలిగిన రిటైల్‌ లావాదేవీలను కార్డులు, మొబైల్‌ సాధనాల ద్వారా ఆఫ్‌లైన్‌ లావాదేవీలను జరపవచ్చును. 

► ఈ పేమెంట్స్‌ కేవలం ముఖాముఖిగానే జరపబడతాయి.

► ఆఫ్‌లైన్ పేమెంట్స్‌ గరిష్ట లావాదేవీ పరిమితి రూ. 200 మాత్రమే. 

► ఆఫ్‌లైన్ లావాదేవీల మొత్తం పరిమితి ఏ సమయంలోనైనా రూ. 2,000 గా ఉంటుంది. అంతకుమించి చేయాలంటే ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ను ఉపయోగించాలి. 

► ఎలాంటి అథనిటికేషన్‌ లేకుండా నిర్ణీత పరిమితి వరకు ఆఫ్‌లైన్‌ పేమెంట్‌ చేయవచ్చును. 

ఆఫ్‌లైన్‌ పేమెంట్స్‌ అంటే..?
ప్రస్తుతం మనమందరం యూపీఐ పేమెంట్స్‌ను ఇంటర్నెట్‌ సహయంతో చేస్తున్నాం. ఇంటర్నెట్‌ సదుపాయం లేని ప్రాంతాల్లోనూ డిజిటల్‌ చెల్లింపులను ఆఫ్‌లైన్‌ పేమెంట్స్‌తో చేయవచ్చును. ఆఫ్‌లైన్ పేమెంట్స్‌ అనేది ఇంటర్నెట్ లేదా టెలికాం కనెక్టివిటీ అవసరం లేని నగదు లావాదేవీ. 

చదవండి: ఆర్బీఐ ప్రయోగం సక్సెస్​.. ఆఫ్​లైన్​ మోడ్​లోనూ డిజిటల్‌ చెల్లింపులు. త్వరలో దేశవ్యాప్తంగా అమల్లోకి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement