ఆర్‌బీఐ మరోసారి వడ్డీరేట్ల కోత? | RBI may implement 50 basis point repo rate cut | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ మరోసారి వడ్డీరేట్ల కోత?

Jun 2 2025 8:14 PM | Updated on Jun 2 2025 9:10 PM

RBI may implement 50 basis point repo rate cut

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) త్వరలో జరగబోయే ద్రవ్య విధాన సమావేశంలో రెపో రేటును మరోసారి తగ్గించేలా నిర్ణయం తీసుకోబోతున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. గతంలో 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించి ఆర్‌బీఐ వ్యవస్థలో లిక్విడిటీని పెంచింది. ఈసారి జూన్ 6న జరగబోయే ద్రవ్య విధాన సమావేశంలో రెపో రేటు 50 బేసిస్ పాయింట్లు కట్‌ చేసే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజా నివేదికలో తెలిపింది. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు వ్యూహాత్మక ప్రయత్నంగా ఆర్‌బీఐ ఈ చర్యలు తీసుకుంటుందని భావిస్తోంది.

నివేదికలో ఎస్‌బీఐ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ తెలిపిన వివరాల ప్రకారం బ్యాంకింగ్ వ్యవస్థ ప్రస్తుతం మిగులు లిక్విడిటీ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఆర్‌బీఐ ఇటీవల తీసుకున్న నిర్ణయంతో ఆర్థిక సంస్థలు సేవింగ్స్‌ ఖాతా వడ్డీ రేట్లను 2.70 శాతానికి తగ్గించాయి. 2025 ఫిబ్రవరి నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు 30-70 బేసిస్ పాయింట్లు తగ్గాయి. దాంతో బ్యాంకుల వద్ద లిక్విడిటీ పెరుగుతోంది. దీన్ని అప్పులు ఇచ్చేందుకు అవకాశంగా మలుచుకుంటున్నాయి.

ఇదీ చదవండి: ఇకపై మినిమం బ్యాలెన్స్‌ లేకపోయినా ఓకే

జూన్ పాలసీ సమావేశంలో 50 బేసిస్ పాయింట్ల రేట్‌ కోత ఉంటుందని భావిస్తున్నామని ఎస్‌బీఐ తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం రేటు తగ్గింపు 100 బేసిస్ పాయింట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. ద్రవ్యోల్బణం గణాంకాలు ఆర్‌బీఐ నిబంధనలమేరకే ఉన్నాయని తెలిపింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సాధారణం కంటే ఎక్కువ రుతుపవనాలు ఉంటాయని అంచనా వేయడంతో పంటల దిగుబడి, ముడి చమురు ధరలు తగ్గడం వంటి అంశాలను ఉటంకిస్తూ ఎస్‌బీఐ 2026 ఆర్థిక సంవత్సరానికి వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణ అంచనాను 3.5 శాతానికి తగ్గించింది. ఆర్థిక పనితీరు పరంగా చూస్తే 2025 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారత జీడీపీ 7.4%కు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 8.4% నుంచి తగ్గింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement