పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ కీలక నిర్ణయం | RBI cancels banking licence of Paytm Payments Bank | Sakshi
Sakshi News home page

పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ కీలక నిర్ణయం

Apr 24 2026 7:29 PM | Updated on Apr 24 2026 7:58 PM

RBI cancels banking licence of Paytm Payments Bank

ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం నేటి నుంచి (ఏప్రిల్‌ 24) అమల్లోకి వస్తుందని తెలిపింది.

పేటీఎం పేమెంట్‌ బ్యాంక్‌లో డిపాజిటర్ల ప్రయోజనాలకు హాని కలిగించే రీతిలో వ్యాపారం జరిగిందని ఆర్‌బీఐ పేర్కొంది. తమకు జారీ చేసిన పేమెంట్స్ బ్యాంక్ లైసెన్సులోని నిబంధనలను పాటించడంలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ విఫలమైందని స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దుపై హైకోర్టులో దరఖాస్తు చేస్తామని సంస్థ వెల్లడించింది.ఆర్‌బీఐ ఇవాళ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌కు ఇచ్చిన బ్యాంకింగ్ లైసెన్స్‌ను బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 లోని సెక్షన్‌ 22(4) కింద రద్దు చేసింది.

ఆంక్షలు విధించడంతో ఈ రోజు నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌కి బ్యాంకింగ్ లైసెన్స్ ఇక చెల్లదు. ఇకపై బ్యాంకింగ్ వ్యాపారం (సెక్షన్‌ 5(b)) లేదా అదనపు వ్యాపారాలు (సెక్షన్‌ 6) నిర్వహించడానికి వీలు లేదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. త్వరలోనే ఈ నిర్ణయానికి సంబంధించిన వివరాలు, తదుపరి చర్యలు ప్రకటించనుంది.

Advertisement
 
Advertisement
Advertisement