భారత సంతతి కుటుంబం మృతి కేసులో కొత్త ట్విస్ట్‌! | Rakesh Kamal Killed Daughter, Wife, And Then Himself | Sakshi
Sakshi News home page

భారత సంతతి కుటుంబం మృతి కేసులో కొత్త ట్విస్ట్‌!

Jan 4 2024 12:59 PM | Updated on Jan 4 2024 1:24 PM

Rakesh Kamal Killed Daughter, Wife, And Then Himself - Sakshi

వారం రోజుల క్రితం అమెరికా అమెరికా మసాచుసెట్స్‌ రాష్ట్రంలో భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త రాకేష్‌ కమల్‌ పాటు ఆయన భార్య టీనా కమల్‌ (54), కుమార్తె ఆరియానా (18) ఇంట్లో మృతి చెందారు. తాజాగా, ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. 

రాకేష్‌ కమల్‌ కుటుంబ సభ్యుల మరణంపై నార్‌ఫోర్క్‌ డిస్ట్రిక్‌ అటార్నీ (డీఏ) మైఖేల్‌ మొరిస్సే ఆధ్వర్యంలో శవ పరీక్ష జరిగింది. ప్రాథమిక అటాప్సీ రిపోర్ట్‌లో రాకేష్‌ కమల్‌ కుటుంబ సభ్యుల మరణానికి కారకులెవరో తెలిసింది. 

భార్య టీనా కమల్‌, కుమార్తె ఆరియాను చంపింది రాకేష్‌ కమలేనని చీఫ్‌ మెడికల్‌ ఎగ్జామినర్‌ ఇచ్చిన అటాప్సీ రిపోర్ట్‌లో తేలిందని మైఖేల్‌ మొరిస్సే తెలిపారు. ముందుగా రాకేష్‌ తన భార్య, కుమార్తను గన్‌తో కాల్చి చంపాడు.వాళ్లద‍్దరూ చనిపోయారని నిర్ధారించుకున్నాక స్వయంగా రాకేష్‌ తనకు తానే గన్‌తో కాల్చుకుని ప్రాణాల్ని వదిలినట్లు చెప్పారు.  

5 మిలియన్ల ఖరీదైన ఇంట్లో 
పలు నివేదిక ప్రకారం..2019లో రాకేష్‌ కుటుంబం 19,000 చదరపు అడుగుల ఎస్టేట్‌ను 5మిలియన్లకు కొనుగోలు చేశారు. ఆ ఇంట్లోనే నివాసం ఉంటుంన్నారు.అయితే డిసెంబర్ 28న రెండు రోజులుగా రాకేష్‌ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సమాచారం లేదని.. స్థానిక బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుల ఇంట్లోకి ప్రవేశించారు. లోపలికి వెళ్లి చూడగా.. ఆ ముగ్గురు రక్తపు మడుగులో విగతజీవులుగా కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాకేష్‌ కుటుంబసభ్యుల మరణాన్ని అనుమాస్పద మృతిగా పరిగణలోకి తీసుకున్నారు.

ఆర్ధిక ఇబ్బందుల కారణంగా
రాకేష్‌ మృతదేహం సమీపంలో తుపాకీ లభ్యం కావడంతో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గృహ హింస జరిగిందా? హత్య చేశారా? ఆత్మహత్య చేసుకున్నారా? అన్న కోణంలో పోలీసుల దర్యాప్తు చేపట్టారు. మరోవైపు మృతదేహాలకు శవ పరీక్ష నిర్వహించారు. తాజాగా, అటాప్సీ రిపోర్ట్‌లో టీనా, ఆరియానాను చంపింది రాకేషేనని ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు. ఆర్ధిక ఇబ్బందుల వల్ల రాకేష్‌ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement