Rakesh Jhunjhunwala Akasa Airlines: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా టార‍్గెట్‌ ఇదే: 'ఆకాశ'..ఫస్ట్‌ లుక్!

Rakesh Jhunjhunwala Akasa Air First Aircraft Viral On Social Media - Sakshi

సామాజిక, ఆర్థిక నేపథ్యంతో సంబంధం లేకుండా అతి తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా ఆకాశ ఎయిర్‌ పేరుతో విమాన సంస్థను ప్రారంభించారు. తాజాగా ఆ సంస్థకు చెందిన విమానాల ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 

 
రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలాకు చెందిన ఆకాశ ఎయిర్‌ విమాన సేవలు ఈ ఏడాది జులై నుంచి అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇప్పుటి వరకు ఆకాశ ఎయిర్‌ విమానాలు ఎలా ఉండబోతున్నాయి. వాటి కోడ్‌ ఏంటనే విషయాలో వెలుగులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఆకాశ ఎయిర్‌ తన సంస్థకు చెందిన విమాన రూపు రేఖల్ని ప్రజలకు పరిచయం చేసింది. విమానం ఆకారం, కలర్స్‌తో పాటు కోడ్‌లను వివరిస్తూ కొన్ని ఫోటోల్ని ట్వీట్‌ చేసింది. 

విమానాలకు కోడ్‌ ఏంటీ!
దేశాన్ని బట్టి ఆయా సంస్థలకు చెందిన విమానాలకు కొన్ని కోడ్‌లు ఉంటాయి. ఉదాహరణకు..ఎయిర్‌లైన్‌కు 'క్యూపీ', ఇండిగో కోడ్‌ '6ఈ',గో ఫస్ట్‌ 'జీ8',ఎయిర్‌ ఇండియాకు 'ఏఐ' అని ఉంది. ఆకాశ ఎయిర్‌ సైతం తమ విమానాల కోడ్‌  ఏంటనేదీ రివిల్‌ చేసింది. కాంట్‌ కీప్‌ క్లైమ్‌! సే టూ హాయ్‌ అంటూ ఆకాశ ఎయిర్‌ విమానం కోడ్‌ 'క్యూపీ- పీఐఈ'! ట్వీట్‌లో పేర్కొంది. 

ఆకాశ ఎయిర్‌ సీఈవో వినయ్‌ దుబే
తాము ముందుగా ప్రకటించిన సమయానికే ఆకాశ ఎయిర్‌ విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయి. జున్‌ 2022కంటే ముందుగా ఫస్ట్‌ ఎయిర్‌ క్రాప్ట్‌ డెలివరీ అవుతుంది. జులై 2022 నాటికి ఆకాశ ఎయిర్‌ కమర్షియల్‌ ఆపరేషన్‌ను ప్రారంభింస్తామని  ఆకాశ ఎయిర్‌ సీఈవో వినయ్‌ దుబే తెలిపారు.

బోయింగ్‌తో ఒప్పందం
రాకేష్‌ ఝున్‌ఝున్‌ వాలా ఆకాశ ఎయిర్‌ విమానాల్ని తయారు చేసేందుకు అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఝున్‌ఝున్‌ వాలా గతేడాది నవంబర్‌ 26,2021న బోయింగ్‌ సంస్థతో 72 మ్యాక్స్‌ విమానాల్ని కొనుగోలు చేశారు. వీటితో పాటు 72బోయింగ్‌ 737మ్యాక్స్‌ ఎయిర్‌ క్రాప్ట్‌లు కూడా ఉన్నాయి. ఆ సంస్థ మొత్తం విమానాల్ని తయారు చేసి ఆకాశ ఎయిర్‌కు అప్పగించనుంది. ఇందులో భాగంగా బోయింగ్‌ కంపెనీ తొలి ఎయిర్‌ క్రాప్ట్‌ ను ఏ ఏడాది జున్‌ నాటికి ఆకాశ ఎయిర్‌కు అందించనుంది.

సాధ్యమేనా!
కాంపిటీషన్‌, ఫ్లైట్ల నిర్వహణతో పాటు పెరిగిపోతున్న ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌, కరోనా కారణంగా ప్రపంచ దేశాల్లో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో పాటు ఇతర కారణాల వల్ల గడిచిన 10ఏళ్లలో పెద్ద సంఖ్యలో ఆయా విమాన సంస్థలు తమ సర్వీసుల్ని పూర్తిగా రద్దు చేశాయి.

పదుల సంఖ్యలో విమానాలు 
ప్రభుత్వం ఆధీనంలో సేవలందిస్తున్న ఎయిర్‌ ఇండియా సైతం నష్టాలకు తట్టుకోలేక టాటా కంపెనీకి అమ్మేసింది. రతన్‌ టాటా ఎయిర్‌ ఇండియా కొనుగోలు చేయడంతో కష్టాల నుంచి గట్టెక్కితే  మిగిలిన సంస్థలు అప్పుల ఊబిలో కూరుకుపోయి.. కార్యకాలాపాల్ని నిలిపివేశాయి. వాటిలో వాయిదూత్‌ ఎయిర్‌ లైన్స్‌, సహార ఎయిర్‌ లైన్స్‌, ఎండీఎల్‌ ఆర్‌ ఎయిర్‌లైన్స్‌, డక‍్కన్‌ ఎయిర్‌ వేస్‌ లిమిటెడ్‌, దర్బంగా ఏవియేషన్‌, దమానియా ఎయిర్‌ వేస్‌, గుజరాత్‌ ఎయిర్‌ వేస్‌, ఎయిర్‌ కోస్టా, ఎయిర్‌ కార్నివాల్‌, జెట్‌ ఎయిర్‌ వేస్‌, ఎయిర్‌ మంత్రా, కింగ్‌ ఫిషర్‌ ఎయిర్ లైన్స్‌లు ఉన్నాయి. 

సుమారు రూ.66వేల కోట్లు    
ఈ క్రమంలో రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా  'ఆకాశ ఎయిర్‌' బ్రాండ్‌ కింద ఎస్‌ఎన్‌వీ ఏవియేషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థను ఏర్పాటు చేశారు. నవంబర్‌ 16న ఆ కంపెనీ 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్ని ఆర్డర్ చేసింది. ఈ ఒప్పందం విలువ దాదాపు 9 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 66 వేల కోట్లు) గా ఉంది. అయితే ఇండస్ట్రీలో నిలదొక్కుకొని అప్పుల‍్లో కూరుకుపోవడంతో పెద్ద సంఖ్యలో ఏవియేషన్‌ సంస్థలు సర్వీసుల్ని నిలిపివేస్తే..ఇప్పుడు ఆకాశ ఎయిర్‌తో కొత్త విమాన సర్వీసుల్ని ప్రారంభించడం కత్తి మీద సామేనని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి👉రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా టార్గెట్‌ అదే, రూ.66వేల కోట్లతో..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top