రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా టార్గెట్‌ అదే, రూ.66వేల కోట్లతో..! | Rakesh Jhunjhunwala Backed Akasa Air To Launch Operations From June | Sakshi
Sakshi News home page

రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా టార్గెట్‌ అదే, రూ.66వేల కోట్లతో..!

Mar 27 2022 11:27 AM | Updated on Jul 6 2022 9:28 AM

Rakesh Jhunjhunwala Backed Akasa Air To Launch Operations From June - Sakshi

దుబాయ్‌ వేదికగా జరిగిన సైడ్‌లైన్స్‌ ఆఫ్‌ వింగ్స్‌ ఇండియా 2022 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినయ్‌ దూబే పాల్గొన్నారు. ఈ సందర్భంగా

ఇండియన్‌ బిగ్‌బుల్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా జూన్‌ నుంచి విమాన సర‍్వీసుల్ని ప్రారంభించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఝున్‌ఝున్‌వాలాకు చెందిన 'ఆకాశ ఎయిర్‌' కార్యకలాపాలు జూన్‌ నుంచి ప్రారంభం కానున్నాయని ఆ సంస్థ సీఈఓ వినయ్‌ దూబే వెల్లడించారు

దుబాయ్‌ వేదికగా జరిగిన సైడ్‌లైన్స్‌ ఆఫ్‌ వింగ్స్‌ ఇండియా 2022 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వినయ్‌ దూబే పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే 5ఏళ్లలో 72 ఆకాశ ఎయిర్‌ విమాన కార్యకలాపాలు నిర్వహిస్తాయని తెలిపారు. ఇప్పటికే మినిస్టరీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌, డైరక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) లైసెన్స్‌ పొందామని, జూన్‌ నెలలో ఆకాశ ఎయిర్‌ తొలి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేశారు. అంతే కాదు తమ వద్ద ప్రస్తుతం 18 విమానాలు ఉండగా.. ఏడాదికి 12 నుంచి 14 విమాన సేవల్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు దుబే చెప్పారు. ఇలా 5 ఏళ్లలో మొత్తం 72 విమానాల్ని అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.

ఎక్కడి నుంచి ప్రారంభం
ఆకాశ ఎయిర్‌ లైన్‌ సేవల్ని మెట్రో నగరాల నుంచి టైర్‌-2, టైర్‌-3 నగరాల్లో, మెట్రో సిటీస్‌ నుంచి మరో మెట్రో సిటీలకు సర్వీసులు ఉంటాయని ఆకాశ ఎయిర్‌ లైన్‌ సీఈఓ తెలిపారు. ఇలా క్యాలండర్‌ ఇయర్‌-2023లో మొత్తం 20 విమాన సర్వీసుల్ని ప్రారంభించేలా టార్గెట్‌ పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.

 

సుమారు రూ.66వేల కోట్లు    
రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా  'ఆకాశ ఎయిర్‌' బ్రాండ్‌ కింద ఎస్‌ఎన్‌వీ ఏవియేషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థను ఏర్పాటు చేశారు. నవంబర్‌ 16న ఆ కంపెనీ 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్ని ఆర్డర్ చేసింది. ఈ ఒప్పందం విలువ దాదాపు 9 బిలియన్ డాలర్లు(సుమారు రూ. 66 వేల కోట్లు) గా ఉందని ప్రకటించిన విషయం తెలిసిందే.

చదవండి: ఛాఛా!! ఆ పిచ్చిప‌ని చేయ‌క‌పోతే మ‌రో వెయ్యికోట్లు సంపాదించే వాడిని: రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement