PwC Report: Indian Media, Entertainment Industry Likely To Touch Rs 4.30 Lakh Crore - Sakshi
Sakshi News home page

ఇండియన్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఇంతటి సత్తా ఉందా?

Jun 23 2022 6:38 PM | Updated on Jun 23 2022 7:28 PM

PwC Report: Indian media entertainment industry likely to touch Rs 4.30 lakh crore - Sakshi

రాబోయే నాలుగేళ్లలో ఇండియన్‌ మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమ గణనీయమైన పురోగతి సాధించబోతుందంటూ ఇంటర్నేషనల్‌ కన్సల్టింగ్‌ ఫర్మ్‌ పీడబ్ల్యూసీ సంస్థ తెలిపింది. రాబోయే నాలుగేళ్లలో ఇండియన్‌ మీడియా, ఎంటర్‌టైన్‌ విభాగం 8.8 శాతం సమ్మిళిత అభివృద్ధి (సీఏజీఆర్‌) సాధిస్తుందని అంచనా వేసింది. దీంతో మీడియా, ఎంటర్‌టైన్‌ పరిశ్రమర  విలువ ఏకంగా రూ. 4.30 లక్షల కోట్లకు చేరుకుంటుందని పీడబ్ల్యూసీ తన నివేదికలో పేర్కొంది.

పీడబ్ల్యూసీ నివేదికలో ముఖ్య అంశాలు ఇలా ఉన్నాయి.

- దేశీయంగా టీవీ, ఎంటర్‌టైన్‌మెంట్‌ పరిశ్రమలో రెవెన్యూ ప్రస్తుత విలువ రూ.3.14 లక్షల కోట్లుగా  ఉంది.
- 2026 నాటికి టీవీ అడ్వెర్‌టైజింగ్‌ విభాగం విలువ రూ.43,000 కోట్లకు చేరుకోవచ్చని అంచనా. దీంతో టీవీ అడ్వెర్‌టైజ్‌మెంట్‌లో ప్రపంచంలో ఐదో స్థానానికి ఇండియా చేరుకుంటుంది. ఇండియా కంటే ముందు వరుసలో అమెరికా, జపాన్‌, చైనా, యూకేలు ఉండనున్నాయి.
- రాబోయే నాలుగేళ్లలో ఓటీటీ వీడియో స్ట్రీమింగ్‌ మార్కెట్‌ విలువ రూ.21,031 కోట్లుగా ఉండబోతుంది. ఇందులో చందాల ద్వారా రూ.19,973 కోట్ల రెవెన్యూ రానుండగా వీడియో ఆన్‌ డిమాండ్‌ ద్వారా రూ.1058 కోట్లు రానుంది.
- రాబోయే రోజుల్లో కూడా ఓటీటీలకు ప్రధాన ఆదాయం చందాల ద్వారానే తప్పితే వీడియో ఆన్‌ డిమాండ్‌ ద్వారా అంతగా పెరగకపోవచ్చని పీడబ్ల్యూసీ అంచనా వేస్తోంది. 5జీ సర్వీసులు అందుబాటులోకి వస్తే ఓటీటీ సేవలు మరింత వేగంగా విస్తరించవచ్చు.
- ప్రస్తుతం రూ.35,270 కోట్లు ఉన్న టీవీ అడ్వెర్‌టైజ్‌ విభాగం మార్కెట్‌ విలువ 2026 నాటికి రూ.43,568 కోట్లు కానుంది. 
- ఇంటర్నెట్‌ యాడ్‌ మార్కెట్‌ 12 శాతం వృద్ధితో 2026 నాటికి రూ.28,234 కోట్లకు చేరుకునే అవకాశం. ఇంటర్నెట్‌ అడ్వెర్‌టైజింగ్‌ మార్కెట్‌లో 69 శాతం మొబైల్‌ ఫోన్ల ద్వారానే జరగనుంది. ప్రస్తుతం మొబైల్‌ ఫోన్ల వాటా 60 శాతంగా ఉంది.
- మ్యూజిక్‌, రేడియో, పోడ్‌కాస్ట్‌ విభాగం మార్కెట్‌ విలువ ప్రస్తుతం రూ.7,216 కోట్లు ఉండగా నాలుగేళ్ల తర్వాత ఇది రూ.11,356 కోట్లకు చేరుకోవచ్చు.
- వీడియో గేమ్‌ మార్కెట్‌ త్వరలో  పైకి దూసుకుపోనుందని సీడబ్ల్యూసీ నివేదిక స్పష్టం చేస్తోంది. రాబోయే నాలుగేళ్లలో ఈ విభాగంలో రూ. 37,535 కోట్లుగా ఉండవచ్చని అంచనా. టర్కీ, పాకిస్తాన్‌ తర్వాత వీడియోగేమ్‌ మార్కెట్‌ ఇండియాలో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది.
- ఇక ఇండియన్‌ సినిమా మార్కెట్‌ ప్రస్తుత రెవెన్యూ 2026 నాటికి రూ. 16,198 కోట్లు కానుంది. ఇందులో బాక్సాఫీసు ద్వారా రూ. 15,849 కోట్ల రాబడి ఉండగా మిగిలిన రూ.349 కోట్లు యాడ్స్‌ ద్వారా రానుంది.
- న్యూస్‌పేపర్‌ రెవెన్యూ రాబోయే నాలుగేళ్లలో 2.7 శాతం వృద్ధితో రూ.26,278 కోట్ల నుంచి రూ.29,945 కోట్లను టచ్‌ చేయనుంది. న్యూస్‌పేపర్‌ రెవెన్యూలో ఇండియా వరల్డ్‌లో ఐదో ర్యాంకులో ఉంది.
చదవండి: ప్రాపర్టీ ట్యాక్స్‌ విషయంలో మజాక్‌ చేస్తే ఇట్లనే ఉంటది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement