Multibagger: లక్ష పెట్టుబడితో 6 నెలల్లో రూ.60 లక్షలు సంపాదించిన మదుపరులు!

Proseed India Penny Stock Turned into a Multibagger in 6 Months - Sakshi

కరోనా మహమ్మారి తర్వాత అత్యంత వేగంగా పుంజుకున్న మార్కెట్ ఏదైనా ఉంది అంటే? అది స్టాక్ మార్కెట్ అని చెప్పుకోవాలి. ఏడాదికి కాలంలోనే సెన్సెక్స్ 20 వేల పాయింట్లకు పైగా పెరిగింది. దీంతో లక్షల కోట్లలో మదుపరులు లాభపడ్డారు. ఈ మధ్య యువత మార్కెట్ మీద ఆసక్తి కనబరచడం, కొత్త పెట్టుబడిదారులు మార్కెట్లోకి ప్రవేశించడంతో స్టాక్ మార్కెట్ జోరందుకుంది. ఒక్కమాటలో చెప్పాలంటే స్టాక్ మార్కెట్ ఒక బంగారు గనిలో మారింది. దీనిలో పెట్టుబడి పెట్టిన వారి జాతకాలు ఏడాదిలో మారిపోతున్నాయి. లక్షల పెట్టుబడుతో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. 

ఈ ఏడాది మే 20న మల్టీబ్యాగర్ ప్రొసెడ్ ఇండియా లిమిటెడ్ షేర్లను లక్ష రూపాయలు పెట్టి కొనిన వారి జాతకం అరునెలల్లోనే మారిపోయింది. ఎందుకంటే, వీరికి ఈ 6 నెల కాలంలోనే 6,006.90% రిటర్న్స్ తో రూ.60 లక్షల రూపాయలు లాభాలు వచ్చాయి. 2021 మే 20న రూ.1.345గా ఉన్న పెన్నీ స్టాక్ ధర నేడు నవంబర్ 18న బీఎస్ఈలో రూ.88.55గా ఉంది. అంటే ఆరు నెలల క్రితం ప్రొసెడ్ ఇండియా స్టాక్స్ లో పెట్టుబడి పెట్టిన లక్ష రూపాయల మొత్తం ఈ రోజు రూ.60 లక్షలుగా మారి ఉండేది. అయితే, ఇదే కాలంలో సెన్సెక్స్ 19.50% పెరిగింది. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఇది హైదరాబాద్‌కు చెందిన కంపెనీ. 

(చదవండి: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసింది చాలు, ఆఫీస్‌కు రండి)

ప్రోసీడ్ ఇండియా లిమిటెడ్(పీఐఎల్) తెలంగాణ (భారతదేశం)లోని హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ప్రముఖ అగ్రి బయో టెక్నాలజీ కంపెనీ. ప్రోసీడ్ అనేది పంటల దిగుబడి సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తుంది. ప్రోసీడ్ ఇండియా లిమిటెడ్ వ్యవసాయ సమాజానికి సేవ చేయడానికి అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులను అందించడానికి సాంకేతికతలను ఉపయోగించుకుంటుంది. సెప్టెంబర్ త్రైమాసికం చివరిలో పబ్లిక్ వాటాదారులు సంస్థలో 3% వాటాను కలిగి ఉన్నారు. 23,176 మంది వాటాదారులు వ్యవసాయ బయోటెక్ విత్తన కంపెనీలో 30.95 లక్షల షేర్లను కలిగి ఉన్నారు. ఇది ఒక వ్యవసాయ బయోటెక్నాలజీ కంపెనీ. భారతదేశం, అంతర్జాతీయ మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తులు, విత్తన వ్యాపారాలలో నిమగ్నమైంది. 

(చదవండి: మ్యూచువల్ ఫండ్స్ వల్ల కలిగే లాభాలేమిటి?)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top