Primebook 4G Laptop: రూ.20 వేలకంటే తక్కువ.. ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే?

Primebook 4g laptop price and deatils - Sakshi

ఆధునిక కాలంలో టెక్నాలజీ భారీగా పెరుగుతున్న క్రమంలో ప్రతి ఒక్కరూ సెల్‌ఫోన్స్, ల్యాప్‍టాప్ వంటివి ఉపయోగించడం సర్వ సాధారణమయిపోయింది. అయితే ప్రతి ఒక్కరికీ ల్యాప్‍టాప్ అందుబాటులో ఉండాలని తక్కువ ధరకే 'ప్రైమ్‍బుక్ 4జీ ఆండ్రాయిడ్' మార్కెట్లో విడుదలైంది. 

మార్కెట్లో విడుదలైన ప్రైమ్‍బుక్ 4జీ ఆండ్రాయిడ్ ల్యాప్‍టాప్ బేస్ వేరియంట్ ధర కేవలం రూ.16,990 కాగా, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ టాప్ వేరియంట్ ధర రూ.18,990. ఇది 4జీ సిమ్‍కు సపోర్ట్ చేస్తుంది. ఆన్‍లైన్ క్లాసులు, ఈ-లెర్నింగ్ వంటి వాటికోసం వీటిని ప్రత్యేకంగా రూపొందించారు.

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‍పై ఈ ప్రైమ్‍బుక్ రన్ అవుతుంది, అయితే విండోస్ అప్లికేషన్లు ఈ ల్యాప్‌టాప్‌లో సపోర్ట్ చేయవు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ల్యాప్‍టాప్ రూపంలో ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్. కావున 10వేలకంటే ఎక్కువ ఆండ్రాయిడ్ యాప్స్ సపోర్ట్ చేస్తాయి.

(ఇదీ చదవండి: మహిళల కోసం స్పెషల్ ఆఫర్.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ: ఎక్కడో తెలుసా?)

ప్రైమ్‍బుక్ 4జీ ల్యాప్‍టాప్ హెచ్‍డీ రెజల్యూషన్ 11.6 ఇంచెస్ ఐపీఎస్ ఎల్‍సీడీ డిస్‍ప్లే, కలిగి మైక్రో ఎస్‍డీ కార్డ్ ద్వారా స్టోరేజీని 200జీబీ వరకు పెంచుకోవచ్చు. దీని బరువు 1.2 కేజీలు. ఇందులో వైఫై, బ్లూటూత్, రెండు యూఎస్‍బీ పోర్టులు, 3.5మిమీ హెడ్‍ఫోన్ జాక్, మినీ హెచ్‍డీఎంఐ పోర్టు కనెక్టివిటీ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

కొత్త ప్రైమ్‍బుక్ 4జీ ల్యాప్‍టాప్ 4,000mAh బ్యాటరీ ప్యాక్ కలిగి, వీడియో కాల్స్ కోసం 2 మెగాపిక్సెల్ వెబ్‍క్యామ్ పొందుతుంది. ఇది ఈ నెల 11నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి రానుంది. క్యాష్ ఆన్ డెలివరీ కాకుండా ప్రీపెయిడ్ ట్రాన్సాక్షన్‍తో ఈ ల్యాప్‍టాప్‍ను కొంటే రూ.2,000 వరకు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top