సానుకూలతలు కొనసాగొచ్చు | Sakshi
Sakshi News home page

సానుకూలతలు కొనసాగొచ్చు

Published Mon, Jan 15 2024 12:49 AM

Positive in the domestic equity market Says Stock experts - Sakshi

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఈ వారమూ సానుకూలతలు కొనసాగొచ్చని స్టాక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశీయ కార్పొరేట్‌ డిసెంబర్‌ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, ప్రపంచ పరిణామాలు ట్రేడింగ్‌పై ప్రభావం చూపొచ్చంటున్నారు. అలాగే విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల ట్రేడింగ్‌ కార్యకలాపాలపై కూడా ఇన్వెస్టర్లు దృష్టి సారించే వీలుందంటున్నారు. వీటితో పాటు డాలర్‌ మారకంలో రూపాయి, క్రూడాయిల్‌ ధరల కదలికలను మార్కెట్‌ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించొచ్చంటున్నారు నిపుణులు.

ఇదే వారంలో మెడి అసిస్ట్‌ హెల్త్‌కేర్‌ సరీ్వసెస్‌ ఐపీఓ జనవరి 15న(నేడు) ప్రారంభం కానుంది. ఇటీవల పబ్లిక్‌ ఇష్యూను పూర్తి చేసుకున్న జ్యోతి సీఎన్‌సీ ఆటోమేషన్‌ షేర్లు మంగళవారం(జనవరి 16న) ఎక్చేంజీలో లిస్ట్‌ కానున్నాయి.

గత వారం మొత్తంగా సెన్సెక్స్‌ 542 పాయింట్లు, నిఫ్టీ 184 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.  దేశీ­య ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టీవీఎస్‌ల క్యూ2 ఆర్థి­క ఫలితాలు మెప్పించడంతో శుక్రవారం సూచీలు తాజా జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి.

‘‘దేశీయ మార్కెట్‌ను సానుకూల వాతావారణ నెలకొనప్పట్టికీ.., సూచీలను స్థిరంగా లాభాల వైపు నడిపే అంశాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా కార్పొరేట్‌ క్యూ3 ఆర్థిక ఫలితాలు మూమెంటమ్‌ను నిర్దేశిస్తాయి. సాంకేతికంగా నిఫ్టీ బలమైన అవరోధం 21,500 – 21,850 శ్రేణిని చేధించింది. కావున ఎగువ స్థాయిలో 22,000 స్థాయిని పరీక్షించవచ్చు. ప్రతికూల పరిస్థితులు ఎదురైతే దిగువ స్థాయిలో 21,750 వద్ద తక్షణ మద్దతు లభిస్తుంది. ఈ స్థాయిని కోల్పోతే 21,650 – 21,575 పరిధిలో మరో బలమైన మద్దతు ఉంది’’ అని కోటక్‌ సెక్యూరిటీస్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అమోల్‌ అథవాలే తెలిపారు.

క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రభావం  
దేశీయ మార్కెట్‌ ముందుగా గతవారం మార్కెట్‌ ముగింపు తర్వాత వెల్లడైన హెచ్‌సీఎల్‌ టెక్, విప్రో, అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ డిసెంబర్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఇక వారంలో దాదాపు 200కు కంపెనీలు తమ క్యూ3 ఫలితాలు ప్రకటించనున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా, హిందుస్థాన్‌ యూనిలీవర్, ఏషియన్‌ పేయింట్స్, ఎల్‌టీఐఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, అ్రల్టాటెక్‌ సిమెంట్, జియో కంపెనీలు ఇందులో ఇన్నాయి. కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్‌ వ్యాఖ్యలను మార్కెట్‌ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్‌ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది.

ప్రపంచ పరిణామాలు  
యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లపై ప్రభావం చూపించే అమెరికా డిసెంబర్‌ ద్రవ్యోల్బణ డేటా, ఉపాధి కల్పన గణాంకాలు అంచనాలకు మించి నమోదడవంతో ‘వడ్డీరేట్ల తగ్గింపు వాయిదా’ అంచనాలు తెరపైకి వచ్చాయి. అలాగే ఎర్ర సముద్రం చుట్టూ నెలకొన్న రాజకీయ అనిశి్చతి, తైవాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో చైనా వ్యతిరేకి డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (డీపీపీ) విజయం పరిణామాలను ఈక్విటీ మార్కెట్‌ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు.  

స్థూల ఆర్థిక గణాంకాలు
జపాన్‌ మెషిన్‌ టూల్‌ ఆర్డర్స్‌ డేటా, యూరోజోన్‌ నవంబర్‌ వాణిజ్య లోటు, పారిశ్రామికోత్పత్తి గణాంకాలతో పాటు దేశీయ హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణ డేటా సోమవారం విడుదల కానుంది. చైనా 2023 డిసెంబర్‌ క్వార్టర్‌ జీడీపీ, పారిశ్రామికోత్పత్తి, రిటైల్‌ అమ్మకాలతో పాటు బ్రిటన్‌ డిసెంబర్‌ ద్రవ్యోల్బణం, పీపీఐ ఇన్‌పుట్‌–అవుట్‌పుట్‌ డేటా బుధవారం వెల్లడి కానుంది. గురువారం యూరోజోన్‌ నవంబర్‌ కరెంట్‌ అకౌంట్, జపాన్‌ మెషనరీ ఆర్డర్స్, పారిశ్రామికోత్పత్తి డేటా వెల్లడి అవుతుంది. ఇక శుక్రవారం జపాన్‌ డిసెంబర్‌ ద్రవ్యోల్బణం, బ్రిటన్‌ డిసెంబర్‌ రిటైల్‌ సేల్స్‌ విడుదల అవుతాయి.

తొలి 2 వారాల్లో రూ.3,900 కోట్లు
దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది తొలి రెండు వారాల్లో రూ.3900 కోట్లు పెట్టుబడి పెట్టారు. గతేడాది డిసెంబర్‌లో రూ.66,134 కోట్లతో పోలిస్తే పెట్టుబడులు నెమ్మదించాయి. భారత ఈక్విటీ మార్కెట్‌ జీవితకాల గరిష్టాలకు చేరుకోవడంతో పాటు ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల తగ్గింపుపై నెలకొన్న అస్థిరతల నేపథ్యంలో ఎఫ్‌ఐఐలు ఆచితూచి వ్యవహరిస్తున్నారని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. ఈక్విటీ పట్ల అప్రమత్తత వహిస్తున్న ఎఫ్‌ఐఐలు డెట్‌ మార్కెట్లో మాత్రం ఉదారంగా ఇన్వెస్టర్లు చేస్తున్నారు. ఈ జనవరి 12 నాటికి డెట్‌ మార్కెట్లో రూ.7,91 కోట్ల పెట్టుబడులు జొప్పించారు. ఇక 2023లో భారత్‌ ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌పీఐలు రూ.1.71 లక్షల కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశారు.

Advertisement
 
Advertisement