చేతులు మారిన కంపెనీలు.. వందల కోట్ల డీల్స్ | Poly Medicure to fully acquire Citieffe Group at enterprise value of Rs 324cr | Sakshi
Sakshi News home page

చేతులు మారిన కంపెనీలు.. వందల కోట్ల డీల్స్

Sep 25 2025 5:03 PM | Updated on Sep 25 2025 6:08 PM

Poly Medicure to fully acquire Citieffe Group at enterprise value of Rs 324cr

మెడికల్‌ పరికరాల తయారీ కంపెనీ పాలీ మెడిక్యూర్‌ ఇటాలియన్‌ కంపెనీ సిటీఫ్‌ గ్రూప్‌ను పూర్తిస్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. 3.1 కోట్ల యూరోల(రూ. 324 కోట్లు) ఎంటర్‌ప్రైజ్‌ విలువలో సిటీఫ్‌లో 100 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. తద్వారా సిటీఫ్‌ ఎస్‌ఆర్‌ఎల్‌సహా.. యూఎస్‌ఏ, మెక్సికోలలోని అనుబంధ సంస్థలను సైతం చేజిక్కించుకోనున్నట్లు పేర్కొంది.

వెరసి మెడిస్ట్రీమ్‌ ఎస్‌ఏ(గ్రూప్‌)లో 100 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు వివరించింది. సిటీఫ్‌ ప్రధానంగా ఆర్థోపెడిక్‌ సంబంధిత పరికరాల తయారీలో ప్రత్యేకతను కలిగి ఉన్నట్లు వెల్లడించింది. 25 దేశాలలో ప్రొడక్టులను పంపిణీ చేస్తున్నట్లు తెలియజేసింది. దీంతో ఆర్థోపెడిక్‌ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించేందుకు వీలు చిక్కనున్నట్లు తెలియజేసింది.

బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ చేతికి మర్ఫీ రిచర్డ్స్‌

హోమ్‌ అప్లయెన్సెస్‌ తయారీ దిగ్గజం బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌.. భారత్‌ సహా పొరుగు దేశాలలో మర్ఫీ రిచర్డ్స్‌ బ్రాండ్‌ మేథో సంపత్తి(ఐపీ) హక్కులను సొంతం చేసుకోనుంది. ఐర్లాండ్‌ కంపెనీ గ్లెన్‌ డింప్లెక్స్‌ గ్రూప్‌ సంస్థ గ్లెన్‌ ఎలక్ట్రిక్‌ నుంచి ఐపీ హక్కులను కొనుగోలు చేయనున్నట్లు బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ తాజాగా పేర్కొంది.

ఇందుకు రూ. 146 కోట్లు వెచ్చించేందుకు కంపెనీ బోర్డు అనుమతించినట్లు వెల్లడించింది. దీంతో భారత్‌తోపాటు.. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులలో మార్ఫీ రిచర్డ్స్‌ బ్రాండ్‌ హక్కులను పొందనున్నట్లు తెలియజేసింది. కాగా.. ఇంతక్రితం 2022 మార్చిలో మర్ఫీ రిచర్డ్స్‌తో ట్రేడ్‌మార్క్‌ ఒప్పందాన్ని మరో 15ఏళ్లకు పొడిగించింది. 2022 జూలై1 నుంచి అమల్లోకి వచ్చేలా ఒప్పందం కుదిరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement