
పూర్తి అనుబంధ సంస్థ జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ 150 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న విద్యుత్ ప్లాంటును కొనుగోలు చేయనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తాజాగా పేర్కొంది. దీనిలో భాగంగా టిడోంగ్ పవర్ జనరేషన్‌లో 100 శాతం వాటా కొనుగోలుకి స్టాట్‌క్రాఫ్ట్ ఐహెచ్ హోల్డింగ్స్ ఏఎస్‌తో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది.
సుమారు రూ. 1,728 కోట్ల ఎంటర్‌ప్రైజ్ విలువలో డీల్ కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలోగల టిడాండ్ వేలీలో 150 మెగావాట్ల సామర్థ్యంతో టిడోంగ్ పవర్ జల విద్యుత్ ప్లాంటును నిర్మిస్తున్నట్లు తెలియజేసింది. 2026 అక్టోబర్‌లో ప్లాంటు కార్యకలాపాలు ప్రారంభమయ్యే వీలున్నట్లు అంచనా వేసింది.
ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్‌తో 22 ఏళ్లకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. మే నెల నుంచి అక్టోబర్‌వరకూ 75 మెగావాట్లను కిలోవాట్‌కు రూ. 5.57 టారిఫ్‌లో ఒప్పందం కుదిరినట్లు తెలియజేసింది. మిగిలిన 75 మెగావాట్లను మర్చంట్ మార్కెట్లో విక్రయించనున్నట్లు వివరించింది.
ఇదీ చదవండి: సహకార బ్యాంకుల్లోనూ ఆధార్ చెల్లింపుల సేవలు