పోకో సీ55 స్మార్ట్‌ఫోన్‌: రూ.10వేల లోపు బెస్ట్‌ ఫోన్‌!

Poco C55 launched in India with leather finish Check details - Sakshi

సాక్షి, ముంబై:  పోకో కొత్త స్మార్ట్‌ఫోన్‌ భారతీయ మార్కెట్లోలాంచ్‌ చేసింది.  పోకో సీ 55 పేరుతో  తీసుకొచ్చిన ఈ ఫోన్‌ధరను పదివేల లోపే నిర్ణయించడం  విశేషం.  5,000mAh బ్యాటరీ, లెదర్‌ ఫినిష్‌లాంటి ఫీచర్లతో బడ్జెట్‌ ఫోన్‌కోసం  చూస్తున్న వారికి ఇది బెస్ట్‌ ఆప్షన్‌ అని చెప్పొచ్చు. ఫారెస్ట్ గ్రీన్, కూల్ బ్లూ మరియు పవర్ బ్లాక్ రంగులలో ఇది లభ్యం. 

పోకో సీ 55  ఫీచర్లు
6.71-అంగుళాల IPS LCD డిస్‌ప్లే
MediaTek Helio G85 SoC
MIUI 13 స్కిన్‌తో Android 12 OS 
50 ఎంపీ డ్యూయల్ రియర్‌ కెమెరా
 5 ఎంపీ  సెల్ఫీ కెమెరా

ఫ్లిప్‌కార్ట్  వివరాల ప్రకారం పోకో సీ 55  4జీ ప్రారంభ ధర 8,499 రూపాయలు.  4జీబీ  ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.9,499. 6జీబీ ర్యామ్‌,  128జీబీ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 10,999. ఈ బడ్జెట్ ఫోన్ ఫిబ్రవరి 28నుంచి సేల్స్‌ మొదలు.   సేల్‌ ఆఫర్‌గా రూ. 500 ఫ్లాట్ తగ్గింపు, బ్యాంక్ కార్డ్‌లపై రూ. 500 తగ్గింపు కూడా అందుబాటులో ఉంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top