ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన పీఎన్‌బీ | PNB hikes FD interest rates by up to 20 bps | Sakshi
Sakshi News home page

ఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన పీఎన్‌బీ

Aug 17 2022 1:35 PM | Updated on Aug 17 2022 2:05 PM

PNB hikes FD interest rates by up to 20 bps - Sakshi

సాక్షి, ముంబై:  ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తనఖాతాదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. అన్ని కాలాల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై  అందించే  10-20  బేసిస్‌ పాయింట్ల వడ్డీరేటును పెంచింది. కొత్త వడ్డీ రేట్లు ఆగస్టు 17, 2022 నుండి అమలులోకి  వస్తాయని బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ పేర్కొంది.

పెరిగిన వడ్డీ రేట్లు కొత్త డిపాజిట్లు, ఇప్పటికే ఉన్న డిపాజిట్ల పునరుద్ధరణ రెండింటికీ వర్తిస్తాయని పీఎన్‌బీ స్పష్టం చేసింది. సంవత్సరం నుండి 2 సంవత్సరాల వరకు,  3 సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 10 నుంచి 20 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఒక సంవత్సరంలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.50 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. రెండేళ్లలోపు మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటు 15 బేసిస్ పాయింట్లు పెరిగి 5.50శాతంగా ఉంటుంది. రెండు నెంచి మూడు సంవత్సరాల వరకు మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 5.60 శాతం వడ్డీ  చెల్లిస్తుంది. 

పీఎన్‌బీ ఉత్తమ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్
బ్యాంక్ అందించే ప్రత్యేక డిపాజిట్ స్కీమ్  పీఎన్‌బీఉత్తమ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడిదారులు  రూ. 15 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేయవచ్చు. ఈ డిపాజిట్ పథకం వ్యవధి 91 రోజుల నుండి 1111 రోజుల వరకు ఉంటుంది . ఈ డిపాజిట్లపై  వడ్డీ రేటు వరుసగా 4.05శాతం  5.55 శాతం దాకా ఉంటుంది.
  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement