PhonePe: రూ. 999కే ఆరోగ్య బీమా..! లాంచ్‌ చేసిన ఫోన్‌పే..! వివరాలు ఇవే..!

Phonepe Launched Health Insurance Plan - Sakshi

కరోనా రాకతో ఆరోగ్య బీమా ప్రతీ కుటుంబానికీ ఉండాలన్న అవగాహన అందరిలో వస్తోంది. ఊహించకుండా ఏదైనా పరిస్థితులు ఎదురైతే.. ఆస్పత్రుల్లో భారీ బిల్లులను కడుతూ ఆర్థికంగా కుదేలవ్వకుండా ఆరోగ్య బీమాతో కాస్త ఉపశమనం పొందవచ్చును. బీమా కంపెనీలకు పోటీగా డిజిటల్‌ చెల్లింపుల యాప్స్‌ కూడా పలు ఆరోగ్య బీమాలను యూజర్లకు అందిస్తోన్నాయి. తాజాగా ఫోన్‌పే యూజర్ల కోసం సరికొత్త ఆరోగ్యబీమాను మొదలుపెట్టింది. 

బీమా వివరాలు ఇలా ఉన్నాయి...
ఆరోగ్య బీమాను అందించే మొదటి డిజిటల్‌ చెల్లింపుల యాప్ ఫోన్‌పే . బీమా పొందడానికి ఎలాంటి ఆరోగ్య పరీక్ష లేదా రిపోర్టు చూపించాల్సిన అవసరం లేదు. పేరు, లింగం, వయసు, ఈమెయిల్ లాంటి వివరాలను ఫిల్‌ చేయడంతో సులభంగా బీమా సౌకర్యాన్ని పొందవచ్చును. ఫోన్‌పే కేవలం రూ. 999 చెల్లిస్తే కస్టమర్లకు ఏడాది గాను రూ. 1,00,000 వరకు బీమా రక్షణ వస్తోంది. అయితే మీరు బీమా కవర్ మొత్తాన్ని పెంచాలనుకుంటే...రూ. 2,00,000 ఆరోగ్య బీమా ప్లాన్‌కు రూ. 1999, రూ. 3,00,000 ప్లాన్‌కు రూ. 2649 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.  ఆయా వ్యక్తుల వయసును బట్టి ఆరోగ్యబీమా ప్రీమియం మారుతూ ఉంటుంది. 

రూ.999 బీమాలో వచ్చే కవరేజ్‌ ఇవే..
రూ. 999 బీమా పథకంతో లక్ష వరకు ఆసుపత్రి ఖర్చులకు కవరేజీ దక్కుతుంది. ఐసీయూ చికిత్స, డేకేర్ , అంబులెన్స్ ఛార్జీలు,  ఆయుష్ చికిత్సతో సహా ఈ బీమాలో పొందవచ్చును. ఇతర ప్రీమియంలో కూడా ఇవే బెనిఫిట్స్‌ రానున్నాయి. ఈ ఆరోగ్య బీమా సుమారు దేశంలోని 7600 ఆసుపత్రులలో అందుబాటులో ఉంది.

ఫోన్‌పే నుంచి ఆరోగ్య బీమాను ఇలా పొందండి.

  • మీ స్మార్ట్‌ఫోన్‌లోని ఫోన్‌పే యాప్‌ను ఒపెన్‌ చేయండి. 
  • హోమ్ స్క్రీన్‌పై ఉన్న బీమా ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు Health@999 ప్లాన్‌పై నొక్కండి.
  • ఆ తరువాత వయసు, ఆరోగ్య బీమా ప్రీమియంను ఎంచుకోండి.
  • దీని తర్వాత మీ పేరు, లింగం, పుట్టిన తేదీ , ఈ-మెయిల్ ఐడిని నమోదుచేయాలి.
  • అన్ని వివరాలను ఫిల్‌ చేసిన తర్వాత...మీరు ఆయా పాలసీను సబ్‌స్రైబ్‌ చేసుకున్నట్లు మెసేజ్‌ వస్తోంది. 

    గమనిక: ఈ ఆరోగ్యబీమాపై జీఎస్‌టీ వర్తిస్తుంది. చివరిగా చెల్లించే మొత్తం విలువ మారుతుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top