కన్సాలిడేషన్‌లో.. ఫార్మా షేర్ల జోరు

Pharma shares jumps in volatile market - Sakshi

అటూఇటుగా మార్కెట్లు 

సెన్సెక్స్‌ 56 పాయింట్లు డౌన్‌ -38,015కు

21 పాయింట్ల క్షీణతతో 11,182కు నిఫ్టీ

ఫార్మా ఇండెక్స్‌ 2.5 శాతం ప్లస్‌

దేశీ స్టాక్‌ మార్కెట్లు కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. జులై ఎఫ్‌అండ్‌వో సిరీస్‌ నేడు ముగియనుండటంతో స్వల్ప ఆటుపోట్లు చవిచూస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 56 పాయింట్లు క్షీణించి 38,015కు చేరగా.. 21 పాయింట్లు తగ్గిన నిఫ్టీ 11,182 వద్ద కదులుతోంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఫార్మా రంగ కౌంటర్లకు మరోసారి డిమాండ్‌ కనిపిస్తోంది. వెరసి ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా ఇండెక్స్‌ 2.5 శాతం ఎగసింది.

డాక్టర్‌ రెడ్డీస్ జూమ్‌
క్యూ1 ఫలితాల నేపథ్యంలో ఫార్మా  దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌ 5 శాతం జంప్‌చేసింది. రూ. 4520 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 4560 వద్ద రికార్డ్‌ గరిష్టాన్ని తాకింది. ఈ బాటలో దివీస్‌ ల్యాబ్స్‌ 5 శాతం ఎగసి రూ. 2537 వద్ద, గ్లెన్‌మార్క్‌ 4.4 శాతం జంప్‌చేసి రూ. 443 వద్ద, అపోలో హస్పిటల్స్‌ 4.2 శాతం పెరిగి రూ. 1710 వద్ద ట్రేడవుతున్నాయి.

లాభాల బాటలో
ఇతర ఫార్మా కౌంటర్లలో లుపిన్‌ 3.6 శాతం పుంజుకుని రూ. 890కు చేరగా.. టొరంట్‌ ఫార్మా 3 శాతం బలపడి రూ. 2450ను తాకింది. ఇదేవిధంగా సన్‌ ఫార్మా, బయోకాన్‌, అరబిందో ఫార్మా, కేడిలా హెల్త్‌కేర్‌ 1.2 శాతం స్థాయిలో లాభపడి కదులుతున్నాయి. కాగా.. నిఫ్టీ దిగ్గజాలలో బీపీసీఎల్‌ 7 శాతం పతనమైంది. ఇతర బ్లూచిప్స్‌లో ఐవోసీ, ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్‌, పవర్‌గ్రిడ్‌, హీరో మోటో, యాక్సిస్‌, గెయిల్‌, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్‌ 4-1.5 శాతం మధ్య డీలాపడ్డాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top