మళ్లీ భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol Price at an all time high in Delhi after 25 paise hike - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో చమురు ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. సామాన్య ప్రజానీకం వాహనదారుల జేబులకు చిల్లుపడుతుంది. సోమవారం చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలపై 25 పైసలు చొప్పున పెంచాయి. దీంతో న్యూఢిల్లీలో పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో 84.95 రూపాయలకు చేరుకుంది. ముంబైలో లీటరుకు పెట్రోల్ ధర రూ.91.56గా ఉంది. హైదరాబాద్ లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై 26 పైసలు చొప్పున పెరగడంతో దీంతో లీటర్‌ ధర రూ.88.37కు, డీజిల్‌ ధర రూ.81.99గా ఉంది. పెరుగుతున్న ధరలను చూస్తుంటే త్వరలోనే హైదరాబాద్ లో పెట్రోల్ ధర 90 రూపాయలు దాటిపోయేలా కనిపిస్తుంది.  

చమురు మార్కెటింగ్ కంపెనీలు జనవరి 7న పెట్రోల్‌కు 0.23 రూపాయలు, లీటరుకు 0.26 డీజిల్ పెంపును ప్రకటించడంతో గత 15 రోజుల్లో రెండవసారి ధరల పెంచారు. 2020 సంవత్సరం మధ్యలో పెట్రోల్ ధర మొదటిసారిగా లీటరుకు 80 రూపాయలకు చేరుకోగా.. అప్పటి నుంచి పెట్రోల్ ధరలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఢిల్లీలో ఇంతకుముందు అక్టోబర్ 4, 2018న అత్యధికంగా నమోదైన పెట్రోల్ రేటు లీటరుకు 84 రూపాయలు. ఐఓసిఎల్ ధరల ప్రకారం పెట్రోల్‌ ధర ముంబయిలో అత్యధికంగా రూ.91.56గా ఉంది. చెన్నైలో రూ.87.63, కోల్‌కతాలో రూ.86.39కి చేరింది. ఇక డీజిల్‌ ధర ముంబయిలో రూ.81.87, చెన్నైలో రూ.80.43, కోల్‌కతాలో రూ.78.72గా ఉంది. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top