
టాటా గ్రూప్‌లో భాగమైన బ్రిటిష్ ఆటోమొబైల్ సంస్థ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) తొలి భారత సీఈవోగా పీబీ బాలాజీ సేవలు అందించనున్నారు. ఆగస్ట్ 4నాటి సమావేశంలో పీబీ బాలాజీ నియామకానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది.
ప్రస్తుతం బాలాజీ టాటా గ్రూప్ సీఎఫ్‌వోగా పనిచేస్తున్నారు. జేఎల్‌ఆర్ సీఈవోగా ఇటీవలే మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న ఆర్డియన్ మార్డెల్ తప్పుకోవాలని నిర్ణయించుకోవడం గమనార్హం. జేఎల్‌ఆర్‌తో ఆయన 35 ఏళ్లుగా కలసి నడుస్తున్నారు. జేఎల్‌ఆర్ సీఈవో బాధ్యతలను బాలాజీ నవంబర్‌లో చేపడతారని కంపెనీ వెల్లడించింది.