పేటీఎం జోరు.. నాలుగింతలు పైకి, ఏకంగా రూ. 6,292 కోట్లు

Paytm Loan Disbursal Reaches Rate Of Rs 6292 Crore - Sakshi

డిజిటల్‌ పేమెంట్స్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీ పేటీఎం నవంబర్‌ నెలలో దేశవ్యాప్తంగా రూ.6,292 కోట్ల రుణాలను మంజూరు చేసింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రుణాలు నాలుగింతలు అయ్యాయి. గత నెలలో రుణాలు అందుకున్న వారి సంఖ్య 27 లక్షల నుంచి 68 లక్షలకు ఎగసింది.

అక్టోబర్‌–నవంబరులో రూ.2.28 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు పేటీఎం వేదిక ద్వారా జరిగాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 37 శాతం అధికం. ఈ రెండు నెలల్లో లావాదేవీలు జరిపిన సగటు వినియోగదార్ల సంఖ్య 33 శాతం అధికమై 8.4 కోట్లకు చేరింది. డిజిటల్‌ రూపంలో నగదును స్వీకరించే పేటీఎం వర్తకుల సంఖ్య 55 లక్షలు ఉంది.

చదవండి  ‘మీ పర్‌ఫార్మెన్స్‌ బాగలేదయ్యా’..పిచాయ్‌ వార్నింగ్‌..ఆందోళనలో గూగుల్‌ ఉద్యోగులు!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top