పాన్‌కార్డు హోల్డర్లకు హెచ్చరిక..! వెంటనే..?

PAN card holders may get fined up to 10000 after 31st March - Sakshi

పాన్‌ కార్డ్‌ నంబర్‌తో ఆధార్‌ అనుసంధానానికి గడువు తేదీని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆర్థిక శాఖకు చెందిన సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) ఈ మేరకు గడువు తేదీని 2022 మార్చి 31 వరకు పొడిగించింది. కోవిడ్‌–19 మహమ్మారి నేపథ్యంలో ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ తేదీని సవరిస్తూ మీడియా, టెక్నికల్‌ పాలసీ ఇన్‌కం ట్యాక్స్‌ కమిషనర్‌ సురభి అహ్లువాలియా అప్పట్లో ఒక ప్రకటన విడుదల చేశారు.  

రూ. పదివేల జరిమానా..!
పాన్‌ కార్డ్‌ హోల్డర్లు మార్చి 31 వరకు ఆధార్‌ కార్డ్‌ నంబర్‌తో లింక్‌ చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన గడువులోగా లింక్‌ చేయడంలో విఫలమైతే ఆయా పాన్‌ కార్డ్‌ హోల్డర్ల  పాన్‌ కార్డ్ చెల్లుబాటు కాదు. దాంతో పాటుగా  రూ. 1,000 రుసుము జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా లావాదేవీలను చేసే సమయంలో ఆధార్‌తో లింక్‌ కానీ పాన్‌ కార్డ్‌ను అందజేస్తే ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్ 272ఎన్‌ ప్రకారం... సదరు వ్యక్తిపై 10 వేల జరిమానాను అసెస్సింగ్‌ అధికారి విధిస్తారు. మ్యూచువల్ ఫండ్‌లు, స్టాక్‌లు, బ్యాంక్ ఖాతా తెరవడం మొదలైన వాటిలో తప్పనిసరిగా పాన్ కార్డ్‌ను కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. 

చదవండి: రూ. 200 లిమిట్‌..! నగదు చెల్లింపులపై ఆర్‌బీఐ కొత్త ఫ్రేమ్‌వర్క్‌..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top