ఆన్‌లైన్‌లో సెర్చింగ్: త్రీడీ రూపంలో సమాచారం | Online Searching For Homes and Properties | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో సెర్చింగ్: త్రీడీ రూపంలో సమాచారం

Aug 2 2025 2:33 PM | Updated on Aug 2 2025 3:04 PM

Online Searching For Homes and Properties

గతంలో ప్రాపర్టీ కొనాలంటే పెద్ద ప్రహసనమే. కానీ, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక చాలా సులువైపోయింది. ఉన్నత స్థాయి ఉద్యోగులు, యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రాపర్టీ కొనుగోళ్లకు పెద్దగా టైమ్‌ వేస్ట్‌ చేయడం లేదు. ఏ ప్రాంతంలో ఎంత ధర ఉంది? ఎక్కడ ఏ నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నాయి? వసతులు, సౌకర్యాలు తదితర వివరాలను ప్రాపర్టీ పోర్టళ్లు అందిస్తున్నాయి. త్రీడీ రూపంలోనూ సమాచారం అందిస్తున్నాయి. దీంతో కొనుగోలుదారుల పని సులువైపోయింది. – సాక్షి, సిటీబ్యూరో

ఆన్‌లైన్‌లో రూ.2 కోట్లకు పైబడిన ప్రాపర్టీల శోధన ఒకట్నిర శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. గతంలో ప్రాపర్టీ కొనాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. కరోనా తర్వాతి నుంచి గృహ కొనుగోలుదారుల ఎంపికలో మార్పులొచ్చాయి. వైద్య సదుపాయాలకు ఎంత దూరంలో ఉంది? భద్రత ఎంత? అనేవి ప్రాధామ్యాలుగా మారాయని తెలిపింది.

గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వైద్య సదుపాయాలు, భద్రత, ఓపెన్‌ స్పేస్‌ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్‌లకు డిమాండ్‌ ఉంటుందని హౌసింగ్‌.కామ్‌ తెలిపింది. త్రీ బీహెచ్‌కే, ఆపై పడక గదుల గృహాలలో 15 శాతం వృద్ధి నమోదయిందని పేర్కొన్నారు. అదే సమయంలో గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించింది. ద్వితీయ శ్రేణి పట్టణాలలోని ప్రాపర్టీలకు డిమాండ్‌ ఏర్పడింది. ప్రధాన నగరంలో ఇరుకు ఇళ్ల మధ్య ఉండటం బదులు శివారు ప్రాంతాలకు, హరిత భవనాలు, విస్తీర్ణం ఎక్కువగా ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement