అదిరిపోయిన వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 5జీ మొబైల్

OnePlus Nord CE 5G Launched With Snapdragon 750G SoC - Sakshi

వన్‌ప్లస్ తన నార్డ్‌ సిరీస్ లో మరో మొబైల్ ను "నార్డ్‌ సీఈ 5జీ" పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎన్నో రోజుల నుంచి  ఊరిస్తున్న స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు విడుదల అయ్యింది. కొంత మేర ధర ఎక్కువ అయిన మంచి ఫీచర్స్ తో మార్కెట్లోకి వచ్చింది. గతంలో ఈ మిడ్ రేంజ్ బడ్జెట్ లో మంచి ఫోన్లు తీసుకొచ్చిన వన్‌ప్లస్ కొద్దీ కాలం నుంచి రూ.40వేల పైన గల హై ఎండ్ మొబైల్స్ తీసుకొస్తుంది. మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో అభిమానులను సంపాదించుకుంది. ఇప్పుడు వారు ఇతర కంపెనీల వైపు చూస్తుండటంతో మళ్లీ తన అభిమానులను తిరిగి పొందటానికి 'నార్డ్‌ సీఈ 5జీ' స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చింది.    

వన్‌ప్లస్ గత ఏడాది నార్డ్ సిరీస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రూ.25,000లోపు బడ్జెట్‌లో వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు ఈ సిరీస్ లో రూ.22,999 బడ్జెట్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీని విడుదల చేసింది. ఇది ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని వన్‌ప్లస్‌ ఎదురు చూశారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ ప్రీ-ఆర్డర్స్ జూన్ 11 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 5జీ ఫీచర్స్: 

 • 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే
 • 90 హెర్ట్జ్  రిఫ్రెష్ రేట్‌
 • క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌
 • ఆండ్రాయిడ్ 11 + ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్‌
 • 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో కెమెరా
 • 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
 • 4,500ఎంఏహెచ్ బ్యాటరీ
 • 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
 • 6 జీబీ +128 జీబీ ధర రూ.22,999
 • 8 జీబీ +128 జీబీ ధర రూ.24,999
 • 12 జీబీ +256 జీబీ ధర రూ.27,999

చదవండి: విప్రో సీఈఓకే వేతనం ఎక్కువ.. ఎంతంటే? 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top