అదిరిపోయే ఫీచర్స్‌తో వచ్చిన వన్‌ప్లస్‌ నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్!

OnePlus Nord 2 5G Launched With Triple Rear Cameras - Sakshi

ఎంతో కాలం నుంచి ఎదురచూస్తున్న వన్‌ప్లస్‌ నార్డ్ ప్రియులకు శుభవార్త. నేడు ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్‌ తన నార్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. నార్డ్ 2 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 1200-ఏఐ ప్రాసెసర్ తీసుకొస్తున్నట్లు మనకు ముందే తెలిసిందే. గత ఏడాది జూలైలో విడుదల చేసిన వన్‌ప్లస్‌ నార్డ్ స్మార్ట్‌ఫోన్ కు వారసుడిగా దీనిని తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ తో పాటు వన్‌ప్లస్‌ బడ్స్ ప్రోను కూడా లాంచ్ చేసింది. మన దేశంలో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999,  8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.34,999గా ఉంది. 

ఇది బ్లూ హేజ్, గ్రే సియెర్రా, గ్రీన్ వుడ్ (ఇండియా-ఎక్స్ క్లూజివ్) రంగులలో లభిస్తుంది. వన్‌ప్లస్‌ నార్డ్ 2 5జీ  జూలై 28న అమెజాన్, OnePlus.in, వన్‌ప్లస్‌ ఎక్స్ పీరియన్స్ స్టోర్లు ద్వారా ఓపెన్ సేల్ కి రానుంది. దీనిలోని ప్రధాన ఫీచర్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి.

వన్‌ప్లస్‌ నార్డ్ 2 ఫీచర్స్:

 • 6.43-అంగుళాల 1080పీ 90హెర్ట్జ్ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్ ప్లే
 • ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 11.3
 • ఆక్టాకోర్ మీడియాటెక్ డిమెన్సిటీ 1200-ఎఐ ప్రాసెసర్
 • 12జీబీ ఎల్ పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్
 • 50 ఎంపీ సోనీ ఐఎమ్ ఎక్స్766 ప్రైమరీ సెన్సార్( f/1.88 లెన్స్, ఓఐఎస్)
 • 8 ఎంపీ సెకండరీ సెన్సార్ (f/2.25 లెన్స్, ఈఐఎస్)
 • 2 ఎంపీ మోనోక్రోమ్ సెన్సార్ (f/2.4 లెన్స్)
 • 32-ఎంపీ సోనీ ఐఎమ్ఎక్స్615 కెమెరా సెన్సార్ (f/2.45 లెన్స్, ఈఐఎస్)
 • 256జీబీ యుఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్
 • 5జీ, 4జీ ఎల్ టీఈ, వై-ఫై 6, బ్లూటూత్ వి5.2, యుఎస్ బీ టైప్-సీ పోర్ట్ 
 • యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్ 
 • ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 
 • 4,500 ఎమ్ఎహెచ్ డ్యూయల్ సెల్ బ్యాటరీ
 • 65 వార్ప్ ఛార్జ్ సపోర్ట్ 
 • 189 గ్రాముల బరువు
   
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top