బడ్జెట్ ధరలో అదిరిపోయిన వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ

OnePlus launches affordable Smart TV 40Y1 in India - Sakshi

కొద్దీ నెలలు క్రితం వరకు స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తమ సత్తా చాటిన చైనా మొబైల్ కంపెనీలు. ఇక తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాయి. కేవలం మొబైల్ మార్కెట్ వరకు మాత్రమే పరిమితం కాకుండా స్మార్ట్ టీవీ మార్కెట్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి. అందులో భాగంగానే వన్‌ప్లస్ ఇండియా తన టీవీ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. తక్కువ ధరకే బెస్ట్ స్మార్ట్ టీవీలను విడుదల చేస్తుంది. తాజాగా వన్‌ప్లస్ భారతదేశంలో వన్‌ప్లస్ 40 వై 1 స్మార్ట్ టీవీని విడుదల చేసింది. ఇది 40 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. దీని ధర రూ.21,999. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది.

వన్‌ప్లస్ వై-సిరీస్‌లో ఇప్పటికే 32-అంగుళాల, 43-అంగుళాల టీవీలను విడుదల చేసింది. అలాగే, వన్‌ప్లస్ యు-సిరీస్‌లో 55 అంగుళాల టీవీ కూడా ఉంది. వన్‌ప్లస్ స్మార్ట్ టీవీ 93.8 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో కలిగి ఉంది. వన్‌ప్లస్ టీవీ 40 వై 1 మే 26 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ లో తక్షణ తగ్గింపు కూడా లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులను ఉపయోగించి టివిని కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు 10 శాతం ఆఫ్ పొందవచ్చు. వన్‌ప్లస్ టీవీ 40 వై 1 ఆండ్రాయిడ్ టీవీ. అంటే యూజర్లు గూగుల్ అసిస్టెంట్‌తో పాటు గూగుల్ ప్లే స్టోర్‌కు చెందిన అనేక యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

వన్‌ప్లస్ టీవీ 40 వై 1 ఫీచర్స్:
వన్‌ప్లస్ టీవీ 40 వై 1 ఆక్సిజన్‌ప్లే యుఐ ఆధారంగా పనిచేస్తుంది. నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, డిస్నీ + హాట్‌స్టార్, సోనీ లివ్, హంగమా, ఈరోస్ నౌ వంటి ప్రైమ్ వీడియోలకు అనుమతి ఉంటుంది. వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ ఫోన్‌ను వన్‌ప్లస్ టీవీని యాక్సెస్ చేసుకోవచ్చు. ట్రెండింగ్ వీడియోలను సులభంగా అన్వేషించడానికి ట్రాక్‌ప్యాడ్‌తో ఫోన్‌ను రిమోట్ కంట్రోల్‌గా ఉపయోగించవచ్చు. వన్‌ప్లస్ టీవీ 40 వై 1 1920x1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌తో డాల్బీ ఆడియో సపోర్ట్, 20W సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే వై-ఫై 2.4GHz 802.11 b / g / n, బ్లూటూత్ 5.0, 1 ఈథర్నెట్ పోర్ట్, 1 RF కనెక్షన్ ఇన్పుట్, 2 HDMI ఇన్పుట్, 1 AV ఇన్పుట్, 1 డిజిటల్ ఆడియో అవుట్పుట్, 2 యూఎస్ బీ పోర్టులు ఉన్నాయి.

చదవండి:

5జీతో భారీగా కొత్త నియామకాలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top