5జీతో భారీగా కొత్త నియామకాలు

5G to spur contractual staffing requirement in telecom: TeamLease - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తే టెలికం రంగంలో వచ్చే రెండేళ్లలో భారీగా ఒప్పంద ఉద్యోగుల నియామకాలు పెరుగుతాయని టీమ్‌లీజ్‌ నివేదిక వెల్లడించింది. ఈ రంగంలో రిక్రూట్‌మెంట్‌ విషయంలో 5జీ కీలక పాత్ర పోషిస్తుందని వివరించింది. నివేదిక ప్రకారం.. కోవిడ్‌-19 నేపథ్యంలో అస్పష్టతలు ఉన్నప్పటికీ ఒప్పంద నియామకాల దృక్పథం సానుకూలంగా ఉంది. నియామకాల రంగంలో పెద్ద మార్కెట్లలో టెలికం విభాగం ఒకటి. మహమ్మారి సమయంలోనూ ఈ రంగం వృద్ధి చెందింది. 

ట్రెండ్‌ ఈ ఏడాదీ కొనసాగనుంది. ఎకానమీ వృద్ధికి సైతం భవిష్యత్తులో 5జీ తోడుగా ఉండనుంది. టెక్నీషియన్స్‌ మొదలుకుని ఇన్‌స్టలేషన్‌ ఇంజనీర్స్‌ వరకు, సివిల్‌ ఇంజనీర్స్‌ నుంచి ప్రాజెక్ట్‌ మేనేజర్ల దాకా నియామకాలు ఉంటాయి. మొత్తంగా ఈ ఏడాది రిక్రూట్‌మెంట్‌ 18 శాతం వృద్ధికి అవకాశం ఉంది. టెలికంను అత్యవసర సేవల కింద ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. 2019తో పోలిస్తే గతేడాది టెలికం రంగంలో 50 శాతం అదనంగా నియామకాలు చేపట్టినట్టు టీమ్‌లీజ్‌ వెల్లడించింది.

చదవండి:

ట్యాక్స్ రిఫండ్‌ ఇంకా రాలేదా..?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top