‘బండ్లు ఓడలు ..ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’!

Ola Electric Produces One Lakh Units In November 2022 - Sakshi

బండ్లు ఓడలు అవ్వడం.. ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’ అనే సామెత మనం వినే ఉంటాం. ఇప్పుడు ఈ సామెత ఓలా సీఈవో భవిష్‌ అగర్వాల్‌కు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది.  

కార్పొరేట్‌ వరల్డ్‌లో బ్రాండ్‌ వ్యాల్యూ చాలా ముఖ్యం. ఒక్కసారి పోగొట్టుకుంటే నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఇటీవలి కాలంలో ఆటోమొబైల్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప్రీ బుకింగ్‌లోనే లక్షకు పైగా ఆర్డర్లు సాధించిన ఓలా పరిస్థితులు ఒకానొక దశలో తారుమారయ్యాయి.  

కొనే నాథుడే లేడు
సమ్మర్‌ సీజన్‌లో ఆ సంస్థ తయారు చేసిన ఓలా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ లోపాలు సీఈవో భవిష్‌ అగర్వాల్‌ను ఉక్కిరి బిక్కిరి చేశాయి. వెహికల్స్‌లోని బ్యాటరీలు హీటెక్కి కాలిపోవడం. వాహనదారులు ప్రమాదాలకు గురికావడం. నాసిరకం మెటీరియల్‌తో వెహికల్స్‌ తయారు చేయడంతో చిన్న పాటి రోడ్డు ప్రమాదాలకే ఆ వెహికల్‌ టైర్లు ఊడిపోవడం లాంటి వరుస ఘటనలతో వాహనదారుల్లో ఆందోళన మొదలైంది. అదే సమయంలో ఓలా ఈవీ వెహికల్స్‌ కొనుగోలు చేయాలనుకున్న వాహన దారులు సైతం వెనక‍్కి తగ్గారు. దీంతో తయారు చేసిన వెహికల్స్‌ అమ్ముడు పోక.. స్టాక్‌ మిగిలిపోయింది.

చదవండి👉 ఓలా..! ఎందుకిలా..! నెలకూడా కాలేదు..అప్పుడే..

దీనికి తోడు సంస్థను వివాదాలు చుట్టుముట్టడంతో ఉద్యోగులు, ఓలా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ తయారీ, వాటి విడుదలలో కీరోల్‌ ప్లే చేస్తున్న టాప్‌ లెవల్‌ ఎక్జిక్యూటీవ్‌లు సంస్థను వదిలేస్తున్నా భవిష్‌ మాత్రం అన్నీ తానై సంస్థను ముందుండి నడిపించారు. ఓలా మినహాయి మిగిలిన వ్యాపారాల్ని క్లోజ్‌ చేశారు. ఓలా ఈవీలపై దృష్టిసారించారు. రోజువారీ కార్యకలాపాల నుండి వైదొలిగి ఇంజనీరింగ్ విధులు, టీమ్ బిల్డింగ్, ఉత్పత్తులపై ఫోకస్‌ చేయడమే కాదు..టూవీలర్లతో పాటు కార్లను మార్కెట్‌లోకి విడుదల చేసే పనిలో పడ్డారు. కట్‌ చేస్తే.. 

కట్‌ చేస్తే
తాజాగా ఈవీ చరిత్రలో అత్యంత వేగంగా వెహికల్స్‌ తయారీ చేసిన సంస్థగా ఓలా సరికొత్త రికార్డులను నమోదు చేసింది. కేవలం పది నెలల్లో లక్ష(నిన్నటితో) వెహికల్స్‌ను తయారు చేసింది. ఈ సందర్భంగా దేశీయ ఆటోమొబైల్‌ చరిత్రలో ఇంత వేగంగా వెహికల్స్‌ను తయారు చేసిన దాఖలాలు లేవని భవిష్‌ అగర్వాల్‌ ట్వీట్‌ చేశారు.  

టార్గెట్‌ కో అంటే కోటి  
అంతేకాదు డిసెంబర్‌ 2021లో ఓలా వెహికల్స్‌ తయారీ ‘సున్నా’ కాగా నవంబర్‌ 2022 నాటికి ఆ సంఖ్య లక్షకు చేరింది. నవంబర్‌ 2023నాటికి 10లక్షలు, నవంబర్‌ 2024 నాటికి కోటి వెహికల్స్‌ తయారీని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. 

నవంబర్‌లో 
ఓలా  ఒక్క నెలలో ఏకంగా తన ఎస్1 సిరీస్‌ 20 వేల ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ను అమ్మింది.  అదనంగా, దాని మొత్తం అమ్మకాలు నెలవారీగా 60 శాతం పెరిగాయి. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తమ విక్రయాల్లో 4 రెట్లు వృద్ధిని నమోదు చేసినట్లు ఓలా వెల్లడించింది. ఈ కాలంలో ప్రతి నిమిషానికి ఒక స్కూటర్‌ను విక్రయించినట్లు నివేదించింది. కాగా, ఓలా వెహికల్స్‌ ఉత్పత్తి, అమ్మకాలపై భవిష్‌ అగర్వాల్‌ సంతోషం వ్యక్తం చేస్తుండగా..ఆయన సహచరులు మాత్రం ‘బండ్లు ఓడలు అవ్వడం..ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనేమో’.. సంస్థ పని ఇక అయిపోయిందిలే అని అనుకునే సమయంలో తన అపారమైన వ్యాపార నైపుణ్యాలతో సంస్థను గట్టెక్కించారంటూ భవిష్‌ అగర్వాల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

చదవండి👉 ఓలా: వెళ్లిపోతాం..ఇక్కడే ఉంటే మునిగిపోతాం..పెట్టేబేడా సర్దుకుని!       

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top