Ola Electric Car: సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోన్న ఓలా ఎలక్ట్రిక్‌ కారు..!

Ola Electric Car All Set For Development Check Concept Design - Sakshi

భారత 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1ను ఘనంగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు అని చెప్పగానే 24 గంటల్లో లక్షకు పైగా ఆర్డర్లు వచ్చాయి. దీంతో ఓలా ఎలక్ట్రిక్ ప్రీబుకింగ్స్‌ విషయంలో ప్రపంచ స్థాయిలో రికార్డు సృష్టించింది. బుకింగ్‌ చేసుకున్న కస్టమర్లకు ఓలా స్కూటర్స్‌ను ఇప్పటికే  డెలివరీ చేయడం మొదలుపెట్టింది.

ఎలక్ట్రిక్‌ స్కూటర్స్‌తో పాటుగా ఎలక్ట్రిక్‌ కార్లను కూడా ఓలా తయారుచేస్తోందని కంపెనీ సీఈవో భవీష్‌​ అగర్వాల్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా ఓలా నుంచి రాబోయే ఎలక్ట్రిక్ కారు టీజర్ ఫోటోని సోషల్ మీడియా ట్విట్టర్‌లో షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలో  రానున్న ఓలా  ఎలక్ట్రిక్ కారు  డిజైన్ కాన్సెప్ట్ లాగా కనిపిస్తుంది, ఇంకా స్టైలిష్ బ్యాటరీ-ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌గా ఉండనుంది. ఈ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

ఓలా ఎలక్ట్రిక్‌ కారు ఫీచర్స్‌..!
ఓలా ఎలక్ట్రిక్‌ సీఈవో భవీష్‌ అగర్వాల్‌ ట్విటర్‌లో పంచుకున్న ఎలక్ట్రిక్‌ కారు డిజైన్‌ కాస్త నిస్సాన్‌ లీఫ్‌ ఈవీ కారు మాదిరిలాగా ఉంది. స్మాల్‌ హ్యచ్‌బ్యాక్‌తో టెస్లా మోడల్‌ 3 లాగా ఓలా ఎలక్ట్రిక్‌ కారు డిజైన్‌ ఉంది. ప్రొడక్షన్ కారు సైడ్ ప్రొఫైల్‌లో క్లీన్ షీట్ డిజైన్‌తో మినిమలిస్ట్ విధానంతో రానుంది. డిజైన్ కాన్సెప్ట్ ఫోటోలో  ఎలాంటి డోర్ హ్యాండిల్‌ లేకపోవడం విషయం.ఈ కారులో  స్ట్రిప్ రూపంలో సొగసైన ఎల్‌ఈడీ టెయిల్‌లైట్‌లు కనిపించాయి. రాబోయే ఓలా ఎలక్ట్రిక్ కారు కాంపాక్ట్ క్యాబిన్‌తో వస్తుందని తెలుస్తోంది.  అలాగే ఈ కారులో  స్పోర్టీ సీట్లు పొందవచ్చని భావిస్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్ కారు స్పోర్టీ అల్లాయ్ వీల్స్‌తో రానుంది. 

కారు వచ్చేది అప్పుడే..!
ఓలా ఎలక్ట్రిక్ కారు గురించి ప్రస్తావిస్తూ ఓలా  మొదటి ఎలక్ట్రిక్ కారు 2023లో వస్తుందని, ఈ ప్రాజెక్ట్‌కు జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ మద్దతు ఇస్తుందని భవిష్ అగర్వాల్ గతంలో చెప్పారు. భారతదేశాన్ని గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా మార్చడమే తమ సంస్థ లక్ష్యమని చెప్పారు. అయితే, ఓలా  నుంచి రాబోయే ఎలక్ట్రిక్ కారు గురించి మరిన్ని వివరాలను వెల్లడించలేదు.  ఓలా ఎలక్ట్రిక్ కారు తమిళనాడులోని ఈవీ తయారీ ప్లాంట్‌లో తయారయ్యే అవకాశం ఉంది. ఈ తయారీ కర్మాగారం ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్‌గా నిలుస్తోంది. 
 

చదవండి: సామాన్యుడితో ఆనంద్‌ మహీంద్రా డీల్‌ పూర్తి.. పాత బండికి కొత్త బొలెరో అందజేత

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top