సామాన్యుడితో ఆనంద్‌ మహీంద్రా డీల్‌ పూర్తి.. పాత బండికి కొత్త బొలెరో అందజేత

Anand Mahindra Gives Bolero Exchange Of Innovative 4 wheeler - Sakshi

దేశం గర్వించదగ్గ వ్యాపారదిగ్గజాల్లో ఆనంద్‌ మహీంద్రా ఒకరు.  సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వర్తమాన అంశాలపై స్పందించడమే కాదు.. అవసరమైతే సాయానికి సైతం వెనకాడని నైజం వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రాది. అలాంటిది మాట ఇచ్చాక ఊరుకుంటాడా?

ఆ మధ్య మహారాష్ట్రకు చెందిన ఓ సామాన్యుడికి ఆనంద్‌ మహీంద్రా ఆఫర్‌ ఇచ్చిన సంగతి తెలిసే ఉంటుంది. తన టాలెంట్‌కు పదునుపెట్టి పాత సామాన్లతో ఫోర్‌ వీలర్‌ను తయారుచేశాడు దత్తాత్రేయ లొహార్‌ అనే అతను. అసమాన్యమైన ఆ ప్రతిభకు, సృజనాత్మక ఆవిష్కరణకు ఆనంద్‌ మహీంద్రా ఫిదా అయిపోయారు. ఆ వాహనం ఇస్తే.. బదులుగా కొత్త బొలెరో వాహనం ఇస్తానని ప్రకటించారు. ఇప్పుడు మొత్తానికి ఆ పని చేసి చూపించారాయన.

‘‘కొత్త బొలెరో తీసుకుని తన వాహనాన్ని మార్చుకునే ప్రతిపాదనను అతను అంగీకరించినందుకు ఆనందంగా ఉంది. నిన్న అతని కుటుంబం బొలెరోను అందుకుంది.  మేము అతని సృష్టికి సగర్వంగా బాధ్యత వహిస్తాం. ఇది మా రీసెర్చ్ వ్యాలీలో మా అన్ని రకాల కార్ల కలెక్షన్‌లో భాగంగా ఉండనుంది ఇక.  స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నాం అంటూ ట్వీట్‌ చేశారు ఆనంద్‌ మహీంద్రా. 

సంబంధిత వార్త: బొలెరో ఆఫర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా! ప్రతిగా ఏం కోరాడంటే..

దత్తాత్రేయ లొహార్‌ స్వస‍్థలం  మహారాష్ట్రలోని దేవ్‌రాష్‌ట్రే గ్రామం. పాత, పాడుబడ్డ కార్ల నుంచి పార్ట్‌లను సేకరించి ఈ ప్రయత్నం చేశాడు.  పాత సామాన్లను చేర్చి ఆ వాహనం చేయడానికి అతను 60 వేల రూపాయల అప్పు కూడా చేశాడు. టూవీలర్స్‌లోని మెకానిజంతో ఈ బండిని తయారు చేయడం విశేషం. పేద కుటుంబమే అయినప్పటికీ కేవలం కొడుకు ముచ్చట తీర్చడానికే చేశాడట! షోరూంలో దత్తాత్రేయ కుటుంబంతో సహా వాహనం అందుకున్న ఫొటోల్ని ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top