మరో భారత్‌ బాండ్‌ ఇండెక్స్‌ షురూ

NSE launches new Nifty Bharat Bond Index - Sakshi

ఆవిష్కరించిన ఎన్‌ఎస్‌ఈ  

న్యూఢిల్లీ: స్టాక్‌ ఎక్సే్ఛంజీ దిగ్గజం ఎన్‌ఎస్‌ఈ అనుబంధ సంస్థ ఎన్‌ఎస్‌ఈ ఇండైసెస్‌ తాజాగా మరో బాండ్‌ ఇండెక్సును ప్రారంభించింది. నిఫ్టీ భారత్‌ బాండ్‌ ఇండెక్స్‌ సిరీస్‌లో భాగంగా ఏప్రిల్‌ 2033ను ప్రవేశపెట్టింది. అత్యధిక భద్రతగల ఏఏఏ రేటింగ్‌ ప్రభుత్వ బాండ్లతో ఎన్‌ఎస్‌ఈ బాండ్‌ ఇండెక్సులను ఆవిష్కరిస్తోంది.

వీటిలో భాగంగా ఏప్రిల్‌ 2033ను విడుదల చేసినట్లు ఎన్‌ఎస్‌ఈ తెలియజేసింది. భారత్‌ బాండ్‌ ఇండెక్స్‌లో భాగంగా తొలు త 2019 డిసెంబర్‌లో ఏప్రిల్‌ 2023, ఏప్రిల్‌ 2030 గడువులతో బాండ్‌ ఇండెక్సులను ప్రవేశపెట్టింది. తదుపరి 2020 జులైలో మరోసారి ఏప్రిల్‌ 2025, ఏప్రిల్‌ 2031 గడువులతో ఇండెక్సులను ఆవిష్కరించింది. భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ సిరీస్‌లో భాగంగా త్వరలో విడుదల చేయనున్న ఆరో భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌ ద్వారా భారత్‌ బాండ్‌ ఇండెక్స్‌ 2033ను ట్రాక్‌ చేయనున్నట్లు ఎన్‌ఎస్‌ఈ తెలియజేసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top